STOCKS

News


బ్రిటానియా లాభం రూ.258 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533619754.png-19003

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.258 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.216 కోట్లతో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,375 కోట్ల నుంచి రూ.2,586 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రీ తెలిపారు.  గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ రెండు ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని వివరించారు. బ్రాండ్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కారణంగా అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయని వరుణ్‌ తెలిపారు. ఫలితంగా నికర లాభం కూడా రెండంకెల వృద్ధి చెందిందని పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ పద్ధతులు కూడా లాభదాయకత మెరుగుదలకు తోడ్పడ్డాయని తెలిపారు. మధ్య ఆసియా, ఆఫ్రికాల్లో మందగమనం కారణంగా అంతర్జాతీయ వ్యాపారం అంతంత మాత్రం వృద్ధినే సాధించిందని వివరించారు. దేశీయ అమ్మకాలు 12 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఇబిటా 18.5 శాతం వృద్ధితో రూ.389 కోట్లకు, ఇబిటా మార్జిన్‌ 80 బేసిస్‌ పాయింట్లు పెరిగి 15.3 శాతానికి పెరిగాయని వివరించారు. 
బోనస్‌ డిబెంచర్లు..
ఒక్కో షేర్‌కు ఒక బోనస్‌ డిబెంచర్‌ను జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌  ఆమోదం తెలిపిందని వరుణ్‌ పేర్కొన్నారు. రూ.60 విలువ గల  సెక్యూర్డ్‌ రిడీమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నామని తెలిపారు. మొత్తం మీద 12,01,59,147 బోనస్‌ డిబెంచర్లను జారీ చేయనున్నామని, వీటి విలువ రూ.721 కోట్లని తెలిపారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను విభజించే విషయాన్ని పరిశీలించడానికి ఈ నెల 23న డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానున్నదని తెలిపారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.6,326 వద్ద ముగిసింది. 

 You may be interested

భూషణ్‌ స్టీల్‌ బిడ్డింగ్‌ గడువుతేదీ పెంపు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్న మూడు దిగ్గజ కంపెనీలకు మరింత సమయం లభించింది. టాటా స్టీల్‌ అభ్యర్ధన మేరకు సవరించిన (రివైజ్డ్‌) బిడ్‌ను దాఖలు చేసేందుకు గడువుతేదీని ఈనెల 13 వరకు పొడిగించినట్లు నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తెలిపింది. భూషణ్‌ స్టీల్‌ను దక్కించుకునేందుకు టాటా స్టీల్‌, లిబర్టీ హౌస్‌, జీఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు రేసులో ఉన్నాయి.

దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.722 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి.గత క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.722 కోట్లకు పెరిగాయని దేనా బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.2,620 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 8 శాతం తగ్గి

Most from this category