STOCKS

News


బీపీసీఎల్‌ లాభం మూడు రెట్లు జంప్‌

Thursday 9th August 2018
news_main1533791840.png-19070

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.745 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.2,293 కోట్లకు పెరిగిందని బీపీసీఎల్ తెలిపింది. ఒక్కో షేర్‌ పరంగా నికర లాభం రూ.3.79 నుంచి రూ.11.66కు ఎగసిందని భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) పేర్కొంది. టర్నోవర్‌ 23 శాతం వృద్ధితో రూ.82,431 కోట్లకు పెరిగిందని వివరించింది. అమ్మకాలు 10.04 మిలియన్‌ టన్నుల నుంచి 10.97 మిలియన్‌ టన్నులకు చేరాయని పేర్కొంది. ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల ఈ క్యూ1లో 7.49 డాలర్ల స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ను సాధించామని బీపీసీఎల్‌ తెలిపింది. గత క్యూ1లో ఇది 4.88 డాలర్లని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేర్‌ 1.1 శాతం క్షీణించి రూ.388 వద్ద ముగిసింది. 


 



You may be interested

5 రెట్లు పెరిగిన నాల్కో లాభం

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 5 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 433 శాతం వృద్ధితో రూ.687 కోట్లకు ఎగసిందని నాల్కో పేర్కొంది. గత క్యూ1లో 19 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ1లో 36 శాతానికి

అదిరిపోయే ఫోటోలకు ‘ఎంఐ ఏ2’

Thursday 9th August 2018

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ ఏ2 ‘ఆండ్రాయిడ్‌ వన్’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత్‌లో విడుదలచేసింది. ఫోటోగ్రఫీ సామర్థ్య పెంపు ఈ ఫోన్‌లో అదనపు ఆకర్షణగా ఉందని సంస్థ ఎండీ, వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ జైన్‌ తెలిపారు. వెనుక వైపు 12 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌ రేర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ డ్యుయల్‌ కెమెరాలు కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌.. ముందుభాగంలో 20ఎంపీ కెమెరాను కలిగిఉందని ఆయన వివరించారు.

Most from this category