STOCKS

News


న్యూమెటల్ రెండో బిడ్ పరిశీలించండి

Saturday 8th September 2018
news_main1536380477.png-20071

న్యూఢిల్లీ: వేలంలో ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం రెండో రౌండులో న్యూమెటల్ వేసిన బిడ్ దాఖలు చేసిన బిడ్‌ చెల్లుబాటు అవుతుందని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. వేదాంత సంస్థ బిడ్‌తో పాటు దీన్ని కూడా పరిశీలించాలని రుణ దాతల కమిటీకి  (సీవోసీ) సూచించింది. గత అనుబంధ సంస్థలు (ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌) కట్టాల్సిన రూ.7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్‌ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్‌ మిట్టల్ ఇండియా బిడ్‌కు కూడా పరిశీలనార్హత ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాల నేపథ్యంలో ఎస్సార్‌ స్టీల్ రుణాలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీ) విక్రయించే ప్రక్రియను ఉపసంహరించుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎస్‌బీఐకి ఎస్సార్‌ దాదాపు రూ. 13,000 కోట్లు బకాయిపడింది.
సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్‌ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. తొలి రౌండులో న్యూమెటల్‌, ఆర్సెలర్‌మిట్టల్‌ కూడా బిడ్లు దాఖలు చేసినప్పటికీ.. బ్యాంక్ రుణాలు డిఫాల్ట్ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలు ఉన్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది. న్యూమెటల్‌లో ఎస్సార్‌ స్టీల్ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్ రుయాకు  వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. అటు, బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్‌ మిట్టల్ బిడ్ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది.  పలు పరిణామాల అనంతరం దీన్ని సవాలు చేస్తూ న్యూమెటల్, ఆర్సెలర్‌మిట్టల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించగా .. తాజా ఆదేశాలు వచ్చాయి.
 You may be interested

మెరుగైన రవాణాతోనే ఆర్థిక వృద్ధి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్‌ చార్జింగ్‌ సదుపాయాలు సహా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో (చైన్‌) పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పర్యావరణంపై పోరుకు శుద్ధ ఇంధన ఆధారిత రవాణా మన చేతుల్లో ఉన్న శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొన్నారు. కార్లపైనే కాకుండా స్కూటర్లు, ఆటో రిక్షాల తయారీపైనా దృష్టి సారించాలన్నారు.

స్వల్పంగా తగ్గిన క్యాడ్‌

Saturday 8th September 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2.4 శాతంగా నమోదయ్యింది. 2017-18 ఇదే కాలంలో ఈ లోటు 2.5 శాతం. విలువలో క్యాడ్‌ 15 బిలియన్‌ డాలర్ల నుంచి 15.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఒక నిర్దిష్ట కాలంలో ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే

Most from this category