బాష్ లాభం 42 శాతం అప్
By Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసులందించడంతో పాటు వాహన విడిభాగాలు కూడా తయారు చేసే బాష్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 42 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.303 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.431 కోట్లకు పెరిగిందని బాష్ తెలిపింది. వాహన విడిభాగాల వ్యాపారం జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని బాష్ ఎమ్డీ సౌమిత్ర భట్టాచార్య పేర్కొన్నారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,830 కోట్ల నుంచి రూ.3,212 కోట్లకు ఎగసింది. గత ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున ఈ రెండు ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని భట్టాచార్య తెలియజేశారు. మొత్తం వ్యయాలు రూ.2,498 కోట్ల నుంచి రూ.2,678 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.
ఇబిటా మార్జిన్ 19.6 శాతం...
నిర్వహణ లాభం 43 శాతం వృద్ధితో రూ.628 కోట్లకు, ఇబిటా మార్జిన్ 3 శాతం పెరిగి 19.6 శాతానికి చేరుకున్నాయి. మొబిలిటీ సొల్యూషన్స్ వ్యాపార విభాగం 21 శాతం వృద్ధి చెందింది. ఈ విభాగం దేశీయ అమ్మకాలు 22 శాతం, ఎగమతులు 7 శాతం చొప్పున ఎగిశాయి.
మరిన్ని పెట్టుబడులు...
పరిశోధన అభివృద్ధి కోసం, కొత్త మార్కెట్ల కోసం మరింతగా పెట్టుబడులు పెట్టనున్నామని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో భారత వాహన పరిశ్రమ కోసం వినూత్నమైన ఉత్పత్తులు అందించనున్నామని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సర్వీసులు, ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ సర్వీసులందించే కంపెనీగా రూపాంతరం చెందుతున్నామని పేర్కొన్నారు. ఈ కంపెనీ వాహన విడిభాగాల తయారీతో పాటు భారత్లో మొబిలిటీ సొల్యూషన్లు, ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కన్సూమర్ గూడ్స్, ఎనర్జీ, బిల్డింగ్ టెక్నాలజీ రంగాల్లో టెక్నాలజీ, సర్వీసులను అందిస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బాష్ షేర్ 1 శాతం లాభంతో రూ.19,319 వద్ద ముగిసింది.
You may be interested
నల్లధనం సమాచార మార్పిడిపై స్విస్తో భారత్ చర్చలు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలను సేకరించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా వారి రహస్య ఖాతాల్లోని డబ్బుకు సంబంధించి ఆటోమేటిక్గా సమాచార మార్పిడిపై స్విట్జర్లాండ్తో చర్చలు జరుపుతోంది. శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నేజియో క్యాసిస్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్గా సమాచార
జూలైలో వాహన విక్రయాలకు బ్రేకులు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో అమ్మకాలు క్షీణించాయి. గతేడాది జూలైలో జీఎస్టీ అమలు కారణంగా భారీ విక్రయాలు నమోదు కావటంతో ఈ సారి అప్పటితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం జూలైలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 2,90,960 యూనిట్లకు తగ్గాయి. గతేడాది జూలైలో అమ్మకాలు 2,99,066