STOCKS

News


20 ఏళ్లలో 2,300 విమానాలు..

Thursday 20th December 2018
news_main1545283833.png-23103

న్యూఢిల్లీ: భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్‌కు వచ్చే 20 ఏళ్లలో దాదాపు 2,300 విమానాలు అవసరం కానున్నాయి. వీటి కొనుగోలుకు సుమారు 320 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 22 లక్షల కోట్లు) వెచ్చించాల్సి ఉండనుంది. 2018-2037 మధ్య కాలానికి సంబంధించి ఈ మేరకు అంచనాలు ఉన్నట్లు విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆసియా పసిఫిక్‌, ఇండియా సేల్స్ విభాగం) దినేశ్ కేస్కర్‌ తెలిపారు. బోయింగ్ ఇండియా అంచనాల ప్రకారం.. భారత్‌కు సింగిల్ ఎయిల్‌ విమానాలు 1,940 (విలువ 220 బిలియన్ డాలర్లు), వైడ్ బాడీ విమానాలు 350 (విలువ 100 బిలియన్ డాలర్లు) అవసరమవుతాయి. 2018-2037 మధ్యలో భారత్‌కు 1 బిలియన్ డాలర్ల కన్నా తక్కువ ఖరీదు చేసే ప్రాంతీయ జెట్ విమానాలు దాదాపు 10 కావాల్సి ఉంటుందని కేస్కర్ పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో భారత్‌కు 290 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,100 పైచిలుకు కమర్షియల్ విమానాలు అవసరమవుతాయని బోయింగ్ అంచనా వేసింది. తాజాగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక అంచనాలను మరింతగా పెంచింది. మరోవైపు, భారత ఏవియేషన్ మార్కెట్‌ చాలా సవాళ్లతో కూడుకున్నదని కేస్కర్ చెప్పారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా కూడా విమానయాన సంస్థలకు లాభాలు రావడం లేదన్నారు. కరెన్సీ మారకం విలువ, ఇంధన ధరలు, తక్కువ చార్జీలు మొదలైనవి సవాళ్లుగా ఉంటున్నాయని తెలిపారు. నిర్వహణ వ్యయాలు భారీగా ఉన్నప్పటికీ.. పోటీని తట్టుకునేందుకు దేశీ ఎయిర్‌లైన్స్ చౌకగా టికెట్లు విక్రయించాల్సి వస్తోందని కేస్కర్ తెలిపారు. ఈ నష్టాలతో నెగ్గుకురావడం కష్టమని పేర్కొన్నారు.You may be interested

ఆర్థిక వ్యవస్థకు ‘డైమండ్‌’ మెరుపు!!

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యేనాటికి ఆర్థికవ్యవస్థను మరింతగా ఉరకలెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశ జీడీపీని 9-10 శాతం చొప్పున పరుగులు పెట్టిస్తూ 2022-23 నాటికి ఎకానమీని 4 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నీతిఆయోగ్‌ రూపొం‍దించింది. ‘‘స్ట్రాటజీ ఫర్‌ న్యూఇండియా@ 75’’ పేరిట ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. 2022 నాటికి భారత్‌ స్వాతంత్రం సాధించి

భారత్‌.. ‘డిజిటల్‌’ లీడర్‌: అంబానీ

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల్లో డిజిటల్‌ అనుసంధానం దిశగా ప్రపంచాన్ని భారత్‌ ముందుండి నడిపిస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అంచనా వేశారు. 130 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యంతో డేటా ఆధారిత నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుందని, దీంతో మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఇప్పటికే భారత్‌ గణనీయమైన డేటాను ఉత్పత్తి చేస్తోందన్నారు. రిపబ్లిక్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో మెజార్టీవాటా యువతదేనని,

Most from this category