STOCKS

News


కేంద్రం ముందుకు బీవోబీ విలీన ప్రతిపాదన

Wednesday 10th October 2018
news_main1539147040.png-20995

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), దేనా, విజయా బ్యాంక్ విలీన ప్రతిపాదన కేంద్రం ముందుకు చేరింది. తుది అనుమతుల కోసం మూడు బ్యాంకులు విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ తెలిపారు. షేర్ల విలీనం, మార్పిడి నిష్పత్తి తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి లాంఛనంగా అనుమతులు వచ్చాక.. విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఇది పూర్తి కావడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టొచ్చన్నారు. ప్రతిపాదిత విలీనానికి మూడు బ్యాంకుల బోర్డులు గత నెల్లోనే ఆమోదముద్ర వేశాయి. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్యను క్రమబద్ధీకరించే దిశగా .. ఎస్‌బీఐ తరహాలోనే ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది. దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకుగా విలీన బ్యాంక్ ఆవిర్భవించనుంది. మరోవైపు, అక్టోబర్ 12తో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీవోబీకి మళ్లీ సారథ్యం వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను సిద్ధమేనని, కానీ ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జయకుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సారథ్యం వహించేందుకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపిక చేసిన ఇద్దరిలో జయకుమార్ కూడా ఒకరు. 2015 అక్టోబర్‌లో బీవోబీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. 



You may be interested

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం అప్‌

Wednesday 10th October 2018

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 24,596.60 వద్ద ప్రారంభమైంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 1.50శాతం పెరిగి 24,853.70 వద్దకు చేరుకుంది. ఈ సూచీలోని భాగమైన మొత్తం 12 షేర్లలో 11 షేర్లకు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, యస్‌ బ్యాంక్‌ మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, అర్‌బీఎల్‌ షేర్లు

వాయిస్‌ ఆదేశాలతో టీవీ!!

Wednesday 10th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్‌ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్‌ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ భారత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది. చానెల్‌, పాటలు, వీడియోలు, గేమ్స్‌, ఫోటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో

Most from this category