STOCKS

News


రెండేళ్లలో అనుసంధానం పూర్తి

Monday 15th April 2019
news_main1555307629.png-25133

రెండేళ్లలో అనుసంధానం పూర్తి
దేనా బ్యాంకు, విజయబ్యాంకుల విలీనంపై బీవోబీ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు ఆఫ్‌ బరోడా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనమై ఒక్కటిగా  మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణ పరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్‌-జూన్‌ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు.



You may be interested

పెట్టుబడికి పుత్తడి పనికిరాదా ?

Monday 15th April 2019

ప్ర: ఎస్‌బీఐ గోల్డ్‌ఫండ్‌లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఫండ్‌కు సంబంధించి గ్రోత్‌ ఆప్షన్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకున్నాను. ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ ఆరంభంలో ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆరంభం నుంచే ఈ ఫండ్‌ ఎన్‌ఏవీను గమనిస్తున్నాను. ఈ ఫండ్‌ గరిష్ట ఎన్‌ఏవీ రూ.10.82 మాత్రమే. ఎన్‌ఏవీలో ఎలాంటి  ఎదుగూ, బొదుగూ లేకపోవడం నష్టమేగా ! ఈ ఫండ్‌ నుంచి వైదొలగమంటారా ? -ధనుంజయ్‌,

నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె

Monday 15th April 2019

ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 గం.ల నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. "మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ)లోని

Most from this category