STOCKS

News


బీఓబీ ఉద్యోగులకు షేర్లు !

Friday 23rd November 2018
news_main1542948009.png-22325

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద తాజా షేర్లను జారీ చేయనుంది. ఈ విషయంపై చర్చించి, ఆమోదం తెలపడానికి తమ డైరెక్టర్లు ఈ నెల 29న సమావేశం కానున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. అనుభవం గల ఉద్యోగులను అట్టిపెట్టుకోవడానికి గాను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు తమ ఉద్యోగులకు షేర్లను జారీ చేయడానికి గత ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ-సాప్స్‌ కారణంగా బ్యాంక్‌లకు రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. షేర్ల జారీ ద్వారా బ్యాంక్‌లు మూలధనాన్ని సమీకరించగలుగుతాయి. మరోవైపు ఉద్యోగులను ప్రోత్సహించినట్లవుతుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌ ద్వారా అలహాబాద్‌ బ్యాంక్‌ రూ.236 కోట్లు సమీకరించింది. యునైటెట్‌ బ్యాంక్‌ 5 కోట్ల షేర్లను ఉద్యోగులకు జారీ చేసింది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 10 కోట్ల షేర్లను జారీ చేస్తుండగా, కెనరా బ్యాంక్‌ 6 కోట్ల షేర్లను ఉద్యోగులకు జారీ చేసి రూ.1,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. గురువారం బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ 1.7 శాతం నష్టంతో రూ.110 వద్ద ముగిసింది. 



You may be interested

సిబ్బందికి పంచకుంటే పన్ను కట్టాల్సిందే..

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ల నుంచి వసూలు చేసే సర్వీస్‌ చార్జీని వర్కర్లు, సిబ్బందికి గానీ పంచని పక్షంలో ఆ మొత్తాన్ని సంస్థ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. సదరు ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల ఖాతాలు తనిఖీ చేయాలని.. సర్వీస్ చార్జీల వసూళ్లలో ఎక్కువ, తక్కువలు చేసి చూపుతున్నాయేమో పరిశీలించాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించింది. మార్గదర్శకాలకు

ఫ్లిప్‌కార్ట్‌ బన్సల్స్‌పై ఐటీ శాఖ దృష్టి

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకులు సచిన్‌, బిన్నీ బన్సల్‌లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు వాటాలు విక్రయించిన డీల్‌పై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. ఈ వాటాల విక్రయంతో ఎంత ఆదాయం వచ్చింది, దానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఎప్పుడు డిపాజిట్ చేయబోతున్నారో తెలియజేయాలంటూ సచిన్‌, బిన్నీలకు నోటీసులు పంపింది. ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఆదాయ పన్ను

Most from this category