News


అమ్మకానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రోడ్డు ఆస్తులు !

Tuesday 18th December 2018
news_main1545110460.png-23036

ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్‌ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కిమీ. మేర విస్తరించిన ఎనిమిది టోల్‌ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది. అంతేకాకుండా 1,736  కిమీ. మేర విస్తరించిన నిర్మాణంలోని నాలుగు రోడ్డు ప్రాజెక్ట్‌ల్లోని వాటాను కూడా అమ్మకానికి పెట్టినట్లు వివరించింది. తిరువనంతపురంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను, ఈపీసీ విభాగానికి సంబంధించిన ఆస్తులను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌కు చెందిన నిర్వహణ, మెయింటనెన్స్‌ వ్యాపారాలను కూడా ఈ గ్రూప్‌ విక్రయించనున్నది. ఈ ఆస్తుల విక్రయానికి ఆర్థిక లావాదేవీల సలహాదారుగా అర్ప్‌వూద్‌ క్యాపిటల్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు, రిజల్యూషన్‌ కన్సల్టెంట్‌గా అల్వరెజ్‌ అండ్‌ మార్సల్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

20 నుంచి సిమెంట్‌ ఎక్స్‌పో

Tuesday 18th December 2018

హైదరాబాద్‌: ఈనెల 20–21 తేదీల్లో 10వ ఇండియన్‌ సిమెంట్‌ ఎక్స్‌పో–2018 జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ప్రదర్శనకు భారతి సిమెంట్స్‌ సిల్వర్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రదర్శనలో సిమెంట్, కాంక్రీట్, ఎక్విప్‌మెంట్, నిర్మాణ, మౌలిక రంగ టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటారు. 80కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఎక్స్‌పోతో పాటుగా ఈ కార్యక్రమంలో 3వ సెమెంట్‌ రివ్యూ అవార్డులు–2018, 5వ సిమెంట్‌

ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు.

Most from this category