STOCKS

News


మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’

Tuesday 22nd January 2019
news_main1548130170.png-23718

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’ పేరుతో నూతన మోడల్‌ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్‌, రెండు డీజిల్‌ వేరియంట్లలో ఈ మోడల్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌ వేరియంట్‌ కారు ధర రూ.63.5 లక్షలు.. డీజిల్‌ వేరియంట్ల ధరల శ్రేణి రూ.60.6 లక్షలు – రూ.65.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ హాన్స్‌ క్రిస్టియన్‌ బార్ట్‌లెస్‌ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్‌ యాక్టివిటీ  వెహికల్‌ సెగ్మెంట్‌ను ఇక్కడి మార్కెట్లో ఏర్పాటు చేశాం. ఎక్స్‌4 విడుదల ద్వారా ఈ విభాగానికి చెందిన నూతన కారును విడుదలచేశాం’ అని చెప్పారు.



You may be interested

‘ఎఫ్‌ జెడ్‌’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తన ఎఫ్‌ జెడ్‌ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్‌ జెడ్‌–ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌1 పేర్లతో ఈ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్‌).. 149 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15

వచ్చే ఏడాదే బజాజ్‌ ‘ఎలక్ట్రిక్‌’ వాహన ఎంట్రీ

Tuesday 22nd January 2019

క్వాడ్రిసైకిల్‌ క్యూట్‌, ఆటోలతో ఆరంభం కేటీఎం హస్క్‌వర్న ఈ ఏడాదే మార్కెట్లోకి సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడి న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న వేళ... వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌ ప్రకటించారు. బీఎస్‌-6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు. ‘‘ఎలక్ట్రిక్‌ క్యూట్‌, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు (ఆటోలు)

Most from this category