STOCKS

News


ఆక్సీ99.. చేతిలో ఇమిడే ఆక్సీజన్‌ క్యాన్‌

Tuesday 20th November 2018
news_main1542684480.png-22201

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆక్సిజన్‌ అనగానే ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఉండే పెద్ద సిలిండర్లే తెలుసు. కానీ ‘ఆక్సీ99’ పేరుతో 120 గ్రాముల బరువున్న క్యాన్‌ భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ధర రూ.650. ఇటలీకి చెందిన ఆరోగ్య సంస్థ ఐఎన్‌జీ ఎల్‌అండ్‌ఏ బాషి టెక్నాలజీ సహకారంతో ఢిల్లీ క్రయోజనిక్‌ ప్రొడక్ట్స్‌ దీన్ని రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని బ్లూవాటర్‌ ఆల్కలైన్‌ సొల్యూషన్స్‌ మార్కెట్‌ చేస్తోంది. క్యాన్‌ జీవిత కాలం రెండేళ్లు. 150 ఇన్‌హలేషన్స్‌ (స్ర్పేలు) వరకు పనిచేస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఇది వాడితే ఉపశమనంగా ఉంటుందని బ్లూవాటర్‌ సొల్యూషన్స్‌ సీఎండీ కలిశెట్టి నాయుడు సోమవారం మీడియాకు తెలిపారు. ఆక్సీ ఉత్పత్తులకు ఇండియన్‌ ఫార్మకోపియా ధ్రువీకరణ ఉందన్నారు. అల్యూమినియంతో తయారైన తేలికైన సిలిండర్లను 75-1,700 లీటర్ల సామర్థ్యంతో కంపెనీ తయారు చేస్తోందని చెప్పారు. అన్ని పట్టణాల్లో పంపిణీదారులను నియమిస్తామన్నారు. 12 రాష్ట్రాల్లో ప్రతి నెల 1,50,000 యూనిట్లను విక్రయిస్తున్నామని ఢిల్లీ క్రయోజనిక్‌ ప్రొడక్ట్స్‌ జోనల్‌ మేనేజర్‌ శివ్‌ శర్మ వెల్లడించారు. 



You may be interested

వచ్చే నెల్లో టెల్కోలతో ట్రాయ్‌ భేటీ

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు, సంబంధిత వర్గాలతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వచ్చే నెల్లో సమావేశం అవ్వాలని భావిస్తోంది. 2019లో చేపట్టబోయే అజెండాపై చర్చ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరపాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ సోమవారం ఇక్కడ తెలిపారు. 

స్విస్‌ వాచీల హైటెక్‌ రూటు!!

Tuesday 20th November 2018

లగ్జరీకి, ఖచ్చితత్వానికి స్విట్జర్లాండ్‌ (స్విస్‌)వాచీలు పెట్టింది పేరు. శతాబ్దాలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ దిగ్గజాలుగా ఎదిగిన స్విస్‌ వాచీ సంస్థలకు ప్రస్తుతం టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్మార్ట్‌వాచీల రూపంలో మరో సవాలు ఎదురైంది. ప్రారంభంలో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌వాచీల తయారీపై స్విస్‌ దిగ్గజాలు కూడా దృష్టి పెడుతున్నాయి. వినూత్న స్మార్ట్, హైబ్రీడ్‌ వాచీలను రూపొందిస్తున్నాయి. సాంప్రదాయ వాచీలకు హైటెక్‌ హంగులు అద్దుతున్నాయి. ఇందుకోసం

Most from this category