STOCKS

News


భారత మార్కెట్లోకి బ్లౌపంక్ట్‌ టీవీలు

Wednesday 12th September 2018
news_main1536730322.png-20192

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లౌపంక్ట్‌  భారత మార్కెట్లోకి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్‌లో ఉంటాయని బ్లౌపంక్ట్‌ టెలివిజన్‌  ఇండియా ఎమ్‌డీ, సీఈఓ కరణ్‌ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని బ్లౌపంక్ట్‌ భారత భాగస్వామి,  ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా కూడా వ్యహరిస్తున్న బేడి  పేర్కొన్నారు.  ఫ్లిప్‌కార్ట్‌ ద్వారానే ఈ టీవీల విక్రయం జరుగుతుందని పేర్కొన్నారు.   ఏడాది కాలంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యమని తెలిపారు. కాగా మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి రూ.2,158 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని బ్లౌపంక్ట్‌ ఎమ్‌డీ అండ్రెజ్‌ సెబర్ట్‌ తెలిపారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 12th September 2018

ముంబై:- ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఉదయం సెషన్స్‌లో ఒడిదుడుకుల నడుమ ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 11300ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ రంగ షేర్లు నష్టపోతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు సూచి దాదాపు 1శాతం వరకు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్‌ సూచి:- నిన్నటి ట్రేడింగ్‌లో దాదాపు

పరిమితి పెంపుతో వేగంగా రుణాల రికవరీ

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు (డీఆర్‌టీ) నివేదించదగ్గ మొండిబాకీల కేసుల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణనిచ్చింది. మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేగంగా రికవర్ చేసుకోవడానికి ఇది తోడ్పడగలదని పేర్కొంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల రికవరీ చట్టం 1993ని సవరిస్తూ.. గత వారంలో ఈ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల నుంచి సొమ్మును రాబట్టే క్రమంలో

Most from this category