News


ఎంబసీ గ్రూప్‌ చేతికి ​14 శాతం వాటా

Saturday 8th June 2019
news_main1559976858.png-26171

  • ఇండియాబుల్స్‌ రియల్టీలో వాటా విక్రయం
  • రూ.950 కోట్లకు విక్రయించిన ప్రమోటర్లు

ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో 14 శాతం వాటాను ఆ కంపెనీ ప్రమోటర్లు రూ.950 కోట్లకు విక్రయించారు. 14 శాతం వాటాకు సమానమైన 6.3 కోట్ల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంబసీ గ్రూప్‌నకు ఇండియా బుల్స్‌  రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్‌ సంస్థలు విక్రయించాయని బీఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ ప్రమోటర్‌ సంస్థలు 6,30,95,240 షేర్లను ఒక్కోటి రూ.150 ధరకు ఎంబసీ ప్రొపర్టీ డెవలప్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించాయి. ఈ ధర పరంగా చూస్తే, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ విలువ రూ.6,800 కోట్లని అంచనా. ఇది ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ రూ.5,800 కోట్ల కంటే రూ. 1,000 కోట్ల అధికంగా ఉండటం విశేషం. కాగా ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ షేర్‌ 3 శాతం నష్టపోయి రూ.128 వద్ద ముగిసింది. కాగా ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఈ ప్రమోటర్‌ సంస్థలకు 39 శాతం మేర వాటా ఉంది. ఎంబసీ గ్రూప్‌ మరో 14 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని, ఫలితంగా ఈ గ్రూప్‌ వాటా 28 శాతానికి పెరుగుతుందని, ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించక తప్పదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
విలీనం వేగవంతం...
ఆర్థిక సేవల రంగంపై దృష్టి కేంద్రీకరించడం, రియల్టీ వ్యాపారం నుంచి వైదొలగడం అనే ఇండియాబుల్స్‌ గ్రూప్‌ వ్యూహంలో భాగంగా ఈ విక్రయం చోటు చేసుకుందని సమాచారం. దీంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీనం మరింత వేగవంతమవుతుదని అంచనా. కాగా ఈ డీల్‌ కారణంగా బెంగుళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌, దేశంలోనే అతి పెద్ద ప్రొపర్టీ మార్కెట్స్‌  అయిన ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మార్కెట్లలోకి ప్రవేశించగలుగుతుంది. 



You may be interested

రెపో రేటుతో వడ్డీ రేట్ల అనుసంధానం

Saturday 8th June 2019

జులై నుంచి అమలు చేయనున్న ఎస్‌బీఐ     ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూలై నుంచి గృహ రుణాలు, స్వల్ప కాలిక రుణాలు, భారీ పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన మీదట.. రూ. 1 లక్ష పైగా పరిమితులు ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్‌,

నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌

Saturday 8th June 2019

ఆర్‌నామ్‌లో 22.49 శాతం వాటా కోసం ఒక్కో షేర్‌ కొనుగోలు ధర రూ.230 మొత్తం రూ.3,179 కోట్లు కేటాయింపు న్యూఢిల్లీ: నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో (ఆర్‌నామ్‌) 22.49 శాతం వాటా కోసం నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ కోసం నిప్పన్‌ కంపెనీ రూ.3,179 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 22.49 శాతం

Most from this category