STOCKS

News


పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసెల్‌

Monday 29th October 2018
news_main1540789802.png-21551

న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్‌ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది. 20 లిస్టెడ్‌ కంపెనీల మొదటి త్రైమాసికాల్లో ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనిపించాయని పేర్కొంది. ‘‘మొదటి త్రైమాసికంలో అమెరికా మార్కెట్‌ నుంచి వచ్చే ఆదాయాల్లో 7 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ మార్కెట్‌ నుంచి ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఉంది. పెద్ద ఫార్మా కంపెనీల ఆదాయలు 12-13 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్‌ తెలిపింది.



You may be interested

ముకేశ్‌ అంబానీ పైప్‌లైన్‌ వ్యాపార విక్రయానికి ఓకే

Monday 29th October 2018

ఆమోదముద్ర వేసిన పీఎన్‌జీఆర్‌బీ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన గ్యాస్‌ పైప్‌లైన్‌ వ్యాపార విక్రయానికి లైన్‌ క్లియర్‌ అయింది. నష్టాల్లో ఉన్న ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ లిమిటెడ్‌(ఈడబ్లూ‍్యపీఎల్‌)ను కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించే ఒప్పందానికి చమురు-గ్యాస్‌ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) కొద్ది వారాల క్రితం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని పీఎన్‌జీఆర్‌బీ చైర్మన్‌ దినేష్‌ కె షరాప్‌ వెల్లడించారు. గతంలో రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌గా

ఎస్సార్‌ స్టీల్‌పై ఎస్సార్‌ గ్రూపు న్యాయపోరాటం

Monday 29th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్‌ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్‌ మిట్టల్‌ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్‌ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్‌

Most from this category