STOCKS

News


భెల్‌కు భారీ ఆర్డర్లు

Thursday 20th September 2018
Markets_main1537429334.png-20408

63 శాతం పెరిగిన నికర లభం
91 శాతం డివిడెండ్‌
కంపెనీ ఏజీఎమ్‌లో వెల్లడించిన సీఎమ్‌డీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ దిగ్గజం, భెల్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లు సాధించింది. అంతకు ముందటి ఆర్డర్లతో పోల్చితే ఇది 74 శాతం అధికమని భెల్‌ సీఎమ్‌డీ అతుల్‌ సోబ్తి తెలిపారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి తమ ఆర్డర్ల బుక్‌ రూ.1,18,000 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌) సందర్భంగా ఆయన మాట్లాడారు.

స్థూల లాభం 152 శాతం అప్‌...
గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 152 శాతం పెరిగిందని సోబ్తి తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.628 కోట్లుగా ఉన్న స్థూల లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,585 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక నికర లాభం రూ.496 కోట్ల నుంచి 63 శాతం వృద్ధితో రూ.807 కోట్లకు పెరిగిందని వివరించారు. టర్నోవర్‌ రూ.27,740 కోట్ల నుంచి రూ.27,850 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో 91 శాతం డివిడెండ్‌ ప్రకటించామని, గత నాలుగేళ్లలో ఇదే అత్యధికమని సోబ్తి తెలిపారు.



You may be interested

టాప్‌ గేర్‌లో మారుతిసుజుకీ

Thursday 20th September 2018

ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో నెంబర్‌ వన్‌ టాప్‌ 10లో 6 మారుతీవే.. న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఆగస్టు విక్రయాలు టాప్‌ గేర్‌లో దూసుకుపోయాయి. ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విభాగానికి సంబంధించిన టాప్‌ 10 విక్రయ జాబితాలో ఏకంగా 6 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎంట్రీ లెవెల్‌ కారైన ఆల్టో అమ్మకాలు 22,237

10 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రెబైన ఇర్కాన్‌ ఐపీఓ

Thursday 20th September 2018

ఈ నెల 28న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ ! న్యూఢిల్లీ: రైల్వే ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇర్కన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 9.85 రెట్లు ఓవర్‌స్క్రైబయింది. సోమవారం ఆరంభమైన ఈ ఐపీఓ బుధవారం ముగిసింది. ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.470-475గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.470 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 99 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా, 9.75 కోట్ల షేర్లకు

Most from this category