STOCKS

News


బీహెచ్‌ఈఎల్‌ ఎలక్ట్రిక్‌ చార్జింగ్ స్టేషన్లు

Friday 18th January 2019
news_main1547790528.png-23658

ఢిల్లీ-చండీగఢ్‌ హైవేపై ఏర్పాటు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఢిల్లీ- చండీగఢ్‌ జాతీయ రహదారిపై సోలార్‌ ఆధారిత చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ ప్రకటించింది. ‘‘250 కిలోమీటర్ల పరిధిలో మధ్య మధ్యలో ఈ ఎలక్ట్రిక్‌ చార్జర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మధ్యలో చార్జింగ్‌ అయిపోతుందేమో!! ప్రయాణించటం కష్టమేమో!! అనే భయాలు ఎలక్ట్రిక్‌ వాహనాదారుల్లో తొలగుతాయి. ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణాలపై విశ్వాసం పెరుగుతుంది’’ అని భెల్‌ వివరించింది. దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, ఇంధన దిగుమతులకు పరిష్కారంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, చార్జింగ్‌ వసతుల లేమి కొనుగోళ్లకు అడ్డుపడుతోంది. ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను తామే సొంతంగా డిజైన్‌ చేయటంతో పాటు తయారీ, సరఫరా, ఇన్‌స్టాల్‌ కూడా చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది. ప్రతీ ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో ఉంటుందని, వేగంగా, నిదానంగా చార్జ్‌ చేసే వసతులు కూడా ఉంటాయని వివరించింది. బీహెచ్‌ఈఎల్‌ ఇప్పటికే ఢిల్లీలోని ఉద్యోగ్‌ భవన్‌లో డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్‌ చార్జర్ల ఏర్పాటుకు సంబంధించి మరో ఆర్డర్‌ కూడా సంస్థ నిర్వహణలో ఉంది.



You may be interested

ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Friday 18th January 2019

క్యు3 ఫలితాలు అదరగొట్టిన ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. అన్ని విభాగాల్లో అదరగొట్టే ప్రదర్శన చూపింది. పెట్రోకెమికల్‌ విభాగంలో మాత్రం కొంత వెనుకంజ కనిపించింది. రిటైల్‌ విభాగపు ప్రదర్శన చాలా బాగుంది. పెట్రోకెమికల్‌ విభాగపు పేలవ ప్రదర్శనను ఇతర విభాగాలు భర్తీ చేశాయి. టవర్‌ వ్యాపారానికి సంబంధించిన డీల్‌ను జియో ఈ ఏడాది ప్రథమార్ధంలో పూర్తి చేయవచ్చని అంచనా. రిటైల్‌ ఎర్నింగ్స్‌

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.333

Friday 18th January 2019

28 శాతం వృద్ధి ఇతర ఆదాయం దన్ను ముంబై: ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.334 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.260 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం బాగా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ శ్యామ్‌

Most from this category