News


భారతీ ఎయిర్‌టెల్‌ రూ.32,000 కోట్ల సమీకరణ

Friday 1st March 2019
news_main1551437655.png-24393

రైట్స్‌ ఇష్యూ, బాండ్ల జారీకి నిర్ణయం
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైంది. రైట్స్‌ ఇష్యూ, బాండ్ల జారీ ద్వారా రూ.32,000 కోట్ల సమీకరణకు భారతీ ఎయిర్‌టెల్‌ బోర్డు నిర్ణయించింది. దీంతో  టెలికం మార్కెట్లో జియో పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీకి మరింత బలం చేకూరనుంది. మరో పోటీ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సైతం ఇటీవలే రూ.18,250 కోట్ల నిధుల సమీకరణతో భారీ రైట్స్‌ ఇష్యూకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జియో టెలికం మార్కెట్‌ విప్లవం ఫలితంగా ఈ రంగంలో జియోతోపాటు ఎయిర్‌టైల్‌, వొడాఫోన్‌ ఐడియాలు మాత్రమే ప్రైవేటు కంపెనీలుగా మిగిలిపోయిన విషయం గమనార్హం. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు, పర్పెట్యుల్‌ బాండ్‌ జారీ ద్వారా రూ.7,000 సమీకరించాలని నిర్ణయించినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ తన ప్రకటనలో తెలిపింది. రూ.5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.215 ప్రీమియంతో రైట్స్‌ ఇష్యూ జారీ ధరను రూ.220గా నిర్ణయించినట్టు... ప్రతీ 67 షేర్లకు 19 షేర్ల రైట్స్‌కు అర్హత ఉంటుందని కంపెనీ తెలిపింది. టెలికం కంపెనీలు భారీ రుణ భారాన్ని మోస్తున్న విషయం తెలిసిందే. తాజా రైట్స్‌ ఇష్యూ ద్వారా వచ్చే నిధులతో వీటికి వ్యాపార కార్యకలాపాల పరంగా వెసులుబాటు లభించనుంది. 



You may be interested

ఈ స్టాక్స్‌లో సత్తా ఉంది: యాంబిట్‌ క్యాపిటల్‌

Friday 1st March 2019

గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ కంపెనీల విలువలు భారీగా దిగొచ్చాయి. నిఫ్టీ 9 శాతం తగ్గితే, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 25 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో టాప్‌ డౌన్‌ క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్‌ పారామీటర్ల ఆధారంగా యాంబిట్‌ క్యాపిటల్‌ అధిక నాణ్యత కలిగిన మిడ్‌క్యాప్‌ కంపెనీలతో ఓ జాబితా రూపొందించింది. బలమైన వ్యాపార మూలాలతో, చారిత్రకంగా చూస్తే ఆకర్షణీయమైన విలువల వద్ద ఇవి ఉన్నట్టు యాంబిట్‌ క్యాపిటల్‌ తెలిపింది.    ఆర్‌వోసీఈ 15

పీఎన్‌బీ.. సంస్కరణల అమల్లో టాప్‌

Friday 1st March 2019

- రెండో స్థానంలో బీవోబీ, ఎస్‌బీఐకి మూడో ప్లేస్‌ - బీసీజీ-ఐబీఏ నివేదిక - ర్యాంకులతో 'బ్యాంకింగ్' మెరుగుపడుతుందన్న ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను

Most from this category