STOCKS

News


భారతీ రియాల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

Thursday 21st March 2019
news_main1553163183.png-24735

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఏరోసిటీ కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్‌ డిస్ట్రిక్ట్స్‌లో డిజైన్‌, డెవలప్‌, ఫైనాన్స్‌, కన్‌స్ట్రక్ట్‌, ఆపరేట్‌, మేనేజ్‌, మెయింటెయిన్‌ ప్రాతిపదికన ఫేజ్‌-1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్‌-2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్‌-1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్‌కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్‌ టైం పేమెంట్‌ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్‌-2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్‌-1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.You may be interested

120 కోట్లు దాటిన టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

Thursday 21st March 2019

- జనవరి వృద్ధిరేటు 0.49 శాతం న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్ర్కైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7

ఐటీ స్టాకులు ఇంకా ఆకర్షణీయమే!

Thursday 21st March 2019

సంపత్‌ రెడ్డి ఐటీ రంగ కంపెనీల షేర్ల వాల్యూషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయని, ఈ రంగంలో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కనిపిస్తోందని బజాజ్‌ అలియాన్జ్‌ సీఐఓ సంపత్‌ రెడ్డి చెప్పారు. క్రూడాయిల్‌ధర  పతనం, ఎఫ్‌ఐఐల ప్రవాహంలో రికవరీ, ఆర్‌బీఐ సహా వివిధ కేంద్ర బ్యాంకుల పాజిటివ్‌ ప్రకటనలు, దేశ ఎకానమీ పురోగమనంతో రెండు నెలలుగా రూపీ బలపడిందన్నారు. మరేదైనా భారీ అంతర్జాతీయ ఇబ్బంది తలెత్తితే తప్ప రూపీ స్థిరంగానే ఉండొచ్చని అంచనా వేశారు.

Most from this category