STOCKS

News


భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు విలీనం సెగ

Thursday 25th April 2019
news_main1556151152.png-25327

  • అంతంతమాత్రంగానే ఆర్థిక పనితీరు
  • ఫ్లాట్‌గా నికర లాభం 
  • ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో  మధ్యంతర డివిడెండ్‌  

న్యూఢిల్లీ: మొబైల్‌ టవర్ల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ చైర్మన్‌ అఖిల్‌ గుప్తా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం ఫ్లాట్‌గా రూ.2,494 కోట్లుగా నమోదైందని వివరించారు. ఆదా యం మాత్రం రూ. 14,490 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.14,582 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  

విలీన ప్రభావం.... 
టెలికం రంగంలో ఏకీకరణ కారణంగా మొబైల్‌ టవర్ల అద్దెలు తగ్గడంతో నికర లాభంలో ఎలాంటి వృద్ధి లేదని అఖిల్‌ గుప్తా తెలిపారు. వొడాఫోన్‌–ఐడియా కంపెనీల విలీనం కారణంగా మొత్తం మీద 75,000 కో–లొకేషన్లను కోల్పోయామని పేర్కొన్నారు. అందుకని గత ఆర్థిక సంవత్సరం క్యూ4ల్లో ఆర్థికంగా కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉందని వివరించారు.  

భవిష్యత్తు బాగు...
డేటాకు డిమాండ్‌ జోరుగా పెరుగుతోందని, భారీ స్థాయిలో నెట్‌వర్క్‌ విస్తరణ జరుగుతోందని, ఫలితంగా తమ కంపెనీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని అఖిల్‌ గుప్తా అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇండస్‌ టవర్స్‌తో తమ కంపెనీ విలీన ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారమే సాగుతోందని, మరికొన్ని నెలల్లో విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. 



You may be interested

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,014 కోట్లు

Thursday 25th April 2019

ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌  5.5 శాతం పెరిగిన షేర్‌    న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,006 కోట్లు

Thursday 25th April 2019

షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌  ముంబై: దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి.  తిరిగి

Most from this category