News


లాభాల్లోకి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌

Wednesday 12th December 2018
news_main1544591169.png-22840

ముంబై: భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ (భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌) 2018-19వ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సర కాలానికి లాభాలార్జించినట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య ప్రీమియం ఆదాయం 38 శాతం పెరిగి రూ.1,087 కోట్లుగా నమోదయిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇది రూ.788 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. కంబైన్డ్‌ రేషియో (మొత్తం ప్రీమియం ఆదాయంలో క్లెయిమ్స్‌, ఖర్చులు పోను లాభదాయకతను తెలియజేసేది) 15 శాతం మెరుగుపడి అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 131.6 శాతం నుంచి 116.5 శాతానికి చేరినట్టు భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. 
 You may be interested

చైనాలో అరబిందో తయారీ ప్లాంట్లు

Wednesday 12th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ అయిన నెదర్లాండ్స్‌లోని హెలిక్స్‌ హెల్త్‌కేర్‌, చైనాకు చెందిన షాన్‌డాంగ్‌ లువోక్సిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్‌ వెంచర్‌ సంస్థను పెట్టి... దీనిద్వారా చైనాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం ప్రకారం జేవీ కంపెనీలో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉంటుంది. జేవీ ద్వారా ఇరు సంస్థలూ నెబ్యులైజర్‌ ఇన్‌హేలర్స్‌తో

ఆర్‌బీఐకి ‘శక్తి’ కాంత్‌!

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి స్వరాష్ట్రం ఒడిస్సా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద

Most from this category