STOCKS

News


భారతీ ఆక్సా లైఫ్‌ వ్యాపారంలో 52 శాతం వృద్ధి

Friday 23rd November 2018
news_main1542947849.png-22323

ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నూతన వ్యాపార ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 52 శాతం పెరిగి రూ.398 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.262 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఇక రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం సైతం 21 శాతం వృద్ధితో రూ.453 కోట్లుగా నమోదైంది. మొత్తం ప్రీమియం చూస్తే.. 34 శాతం వృద్ధి చెంది రూ.851 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.636 కోట్లుగా ఉంది. నిర్వహణలోని ఆస్తులు 21 శాతం పెరిగి రూ.4,928 కోట్లకు చేరాయని కంపెనీ తెలిపింది.
 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌ బన్సల్స్‌పై ఐటీ శాఖ దృష్టి

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకులు సచిన్‌, బిన్నీ బన్సల్‌లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు వాటాలు విక్రయించిన డీల్‌పై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. ఈ వాటాల విక్రయంతో ఎంత ఆదాయం వచ్చింది, దానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఎప్పుడు డిపాజిట్ చేయబోతున్నారో తెలియజేయాలంటూ సచిన్‌, బిన్నీలకు నోటీసులు పంపింది. ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఆదాయ పన్ను

పెన్నార్‌కు రూ.317 కోట్ల ఆర్డర్లు

Friday 23rd November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్‌ సంస్థ పెన్నార్‌ గ్రూప్‌కు రూ.317 కోట్ల ఆర్డర్‌ దక్కింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌కు సోలిస్‌ ఇంజనీరింగ్, జేఎం ఇన్‌ఫ్రాటెక్, ఐఎఫ్‌బీ, అశోక్‌ లేల్యాండ్, టెకమ్‌సే, వాబ్‌కో, మహీంద్రా, సేలం స్టీల్‌ సంస్థల నుంచి రూ.190 కోట్ల రైల్వే, ట్యూబ్స్, పారిశ్రామిక విడిభాగాల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, పెన్నార్‌ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్‌కు (పెబ్స్‌

Most from this category