News


భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ సక్సెస్‌

Saturday 18th May 2019
news_main1558153492.png-25815

  • అధికంగా సబ్‌స్క్రిప్షన్లు వచ్చినట్టు కంపెనీ ప్రకటన

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూకు మంచి స్పందన వచ్చింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు రూ.25,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మే 3న ఆరంభమైన రైట్స్‌ ఇష్యూ శుక్రవారంతో ముగిసినట్టు పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, చెల్లింపులు పూర్తయిన తర్వాత కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఒక్కో షేరును రూ.220 చొప్పున ప్రస్తుత వాటాదారులకు రైట్స్‌ ఇష్యూలో భాగంగా కంపెనీ ఆఫర్‌ చేసింది. తద్వారా రూ.25,000 కోట్లు, విదేశీ కరెన్సీ పర్పెచ్యువల్‌ బాండ్‌ ఇష్యూ ద్వారా మరో రూ.7,000 కోట్లు సమీకరించాలని గతంలో కంపెనీ నిర్ణయించిన విషయం గమనార్హం. రైట్స్‌ ఇష్యూ నిధులు భవిష్యత్తులో నెట్‌వర్క్‌ సామర్థ్య విస్తరణ, కంటెంట్‌, టెక్నాలజీ భాగస్వామ్యాలకు సాయపడుతుందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూలో సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్‌ రూ.3,750 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు వచ్చింది. 



You may be interested

అరవింద్‌ లాభం రూ.67 కోట్లు

Saturday 18th May 2019

ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌  ఎన్‌సీడీల ద్వారా రూ.300 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అరవింద్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్‌ కంపెనీ నుంచి

బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు

Saturday 18th May 2019

ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై కసరత్తు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడి న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్‌ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్‌ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. మొత్తం

Most from this category