News


ఎయిర్‌టెల్‌: ఆదాయానికి 3 రెట్లు అప్పులు

Tuesday 17th July 2018
news_main1531814382.png-18393

భారతీ ఎయిర్‌టెల్‌ అప్పులు దాని ​ఆదాయానికి మూడు రెట్లపైగా ఎక్కువగా ఉన్నాయి. రిలయన్స్‌ జియో టారిఫ్‌ వార్‌ దీనికి ప్రధాన కారణం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం చూస్తే.. బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ సారథ్యంలోని ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ చెల్లించాల్సిన రుణాలు రూ.71,460 కోట్లుగా ఉన్నాయి. ఇక దశాబ్ద కాలంలో కంపెనీ  నగదు రాబడి రూ.20,719 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆర్థిక అప్పులు 2018 మార్చితో ముగిసిన సంవత్సరంలో రూ.1,57,616 కోట్లగా ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో భారీ తగ్గుదలను ప్రకటించింది. దీనికి కారణం రిలయన్స్‌ జియో టెలికంలోకి ఎంట్రీ ఇవ్వడం. ఇది చౌక ధరకే డేటాను, ఉచితంగా కాల్స్‌ను ఆఫర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. జియో ఆరంభంతో టెలికంలో స్థిరీకరణ ప్రారంభమైంది. ప్రైవేట్‌ టెల్కోల సంఖ్య 8 నుంచి 3కి తగ్గింది. 
ఇంటర్నేషనల్‌ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తీవ్రమైన పోటీ కొనసాగితే భారతీ ఎయిర్‌టెల్‌ క్రేడిట్‌ రేటింగ్‌ను వచ్చే 6-12 నెలల కాలంలో తగ్గించొచ్చని పేర్కొంది. ఎయిర్‌టెల్‌ తన అప్పును రిఫైనాన్స్‌ చేయడమో లేదా అప్పు తీర్చడానికి వివిధ ఇన్వెస్ట్‌మెంట్లలో తన వాటాను విక్రయించడమో చేయాల్సి వస్తుంది. సంస్థ బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా ఉందని, డెట్‌-ఈబీటా నిష్పత్తి సౌకర్యవంతంగానే ఉందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.

కాగా భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.53 శాతం క్షీణతతో రూ.342.1 వద్ద ట్రేడవుతోంది.  ఇది దాదాపు 52 వారాల కనిష్టస్థాయి.

 
 



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం 25 శాతం జంప్‌- షేరు 12 శాతం ర్యాలీ

Tuesday 17th July 2018

ఫెడరల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సపు తొలి త్రైమాసికంలో (క్యూ1) రూ.263 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికపు నికర లాభం రూ.210 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదయ్యింది. బ్యాంక్‌ మొండిబకాయిల కేటాయింపులు రూ.236 కోట్ల నుంచి రూ.199 కోట్లకు తగ్గడం దీనికి ప్రధాన కారణం. నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.980 కోట్లకు పెరిగింది. ఇక బ్యాంక్‌

హెచ్‌యూఎల్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Tuesday 17th July 2018

సోమవారం క్యు1 ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం పతనమైంది. ఫలితాలు బాగున్నప్పటికీ కొన్ని బ్రోకరేజ్‌లు కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కొన్ని సంస్థలు టార్గెట్‌ ధరను పెంచాయి.  క్యు1 ఫలితాల అనంతరం హెచ్‌యూఎల్‌పై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు... 1. యాక్సిస్‌ క్యాపిటల్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1720. రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించింది. ఇటీవలి ర్యాలీతో షేరు వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారాయి.

Most from this category