STOCKS

News


ఎయిర్‌టెల్‌ లాభం 72శాతం డౌన్‌

Friday 1st February 2019
Markets_main1549006042.png-23937

ఈ క్యూ3లో నికర లాభం రూ.86 కోట్లు
-1 శాతం వృద్ధితో రూ.20,519 కోట్లకు మొత్తం ఆదాయం
-భారత్‌లో తగ్గిన వినియోగదారులు, పెరిగిన డేటా

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ (ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఎబిటా 17 శాతం తగ్గి రూ.6,307 కోట్లకు చేరిందని వివరించారు. గత క్యూ3లో రూ.123గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ)ఈ క్యూ3లో 16 శాతం తగ్గి రూ.104కు చేరిందని తెలిపారు. గత క్యూ3లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న నికర రుణభారం ఈ క్యూ3లో రూ.6,837 కోట్లు క్షీణించి రూ.1.06 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు.
ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకే లాభాలు...
ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కారణంగా రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని విఠల్‌ తెలిపారు.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.972 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని తెలిపారు. గత క్యూ3లో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నికరలాభం ఈ క్యూ3లో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11 శాతం పెరిగి రూ.5,904 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్‌టెల్‌మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది.
40.4 కోట్లకు ఖాతాదారులు....
గత క్యూ3లో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం  ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని విఠల్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. ఇక భారత్‌ విషయానికొస్తే, వినియోగదారుల సంఖ్య 2 శాతం తగ్గి 28.42 కోట్లకు చేరిందని తెలిపారు. భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని, తీవ్రమైన పోటీ కారణంగా భారత మొబైల్‌ వ్యాపారం 4 శాతం క్షీణించిందని వివరించారు.
మూడు రెట్లు పెరిగిన డేటా
భారత్‌లో వినియోగదారుల సంఖ్య తగ్గినా, డేటా వినియోగం మాత్రం జోరుగా ఉందని విఠల్‌ వివరించారు.. గత క్యూ3లో 1,106 బిలియన్‌ ఎమ్‌బీగా ఉన్న డేటా వినియోగం ఈ క్యూ3లో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 3,217 బిలియన్‌ ఎమ్‌బీలకు పెరిగిందని పేర్కొన్నారు. మొబైల్‌ 4జీ డేటా వినియోగదారులు 112 శాతం వృద్ధితో 7.71 కోట్లకు పెరిగారని వివరించింది.



You may be interested

వేదాంత లాభం రూ.1574 కోట్లు

Friday 1st February 2019

-26 శాతం క్షీణత -పెరిగిన వ్యయాలు, కమోడిటీల ధరల ప్రభావం న్యూఢిల్లీ:  వేదాంత కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,574 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.2,114 కోట్ల నికర లాభం వచ్చిందని, 26 శాతం క్షీణత నమోదైందని వేదాంత తెలిపింది. వ్యయాలు అధికం కావడం, కమోడిటీ ధరలు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.24,842 కోట్ల

చందాకొచ్చర్‌ నుంచి రూ.9కోట్లు వెనక్కి

Friday 1st February 2019

బోనస్‌ ప్రయోజనాలను వెనక్కి తీసుకోనున్న బ్యాంకు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీలో కొచర్‌ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టు పరిగణిస్తామని, ఆమెకు గతంలో ఇచ్చిన పనితీరు ఆధారిత బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం

Most from this category