STOCKS

News


సగం తగ్గిన బీపీసీఎల్‌ లాభం

Tuesday 30th October 2018
Markets_main1540877448.png-21574

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్లో 48 శాతం తగ్గిపోయి రూ.1,218 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,357 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.64,133 కోట్ల నుంచి రూ.82,884 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యయాలు పెరిగిపోవడం ప్రభావం చూపించింది. వ్యయాలు రూ.61,475 కోట్ల నుంచి రూ.81,550 కోట్లకు  చేరాయి. స్థూల రిఫైనరీ మార్జిన్‌ (జీఆర్‌ఎం) 5.57 డాలర్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.97 డాలర్లుగా ఉండడం గమనార్హం.



You may be interested

ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి

Tuesday 30th October 2018

ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి భారత్‌లో భాగస్వాముల కోసం అన్వేషణ అనిల్‌ అంబానీ గ్రూపుతో చర్చలు న్యూఢిల్లీ: గల్ఫ్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎతిహాద్‌, భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లో ప్రముఖ కార్పొరేట్‌ గ్రూపు భాగస్వామ్యంతో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేయాలన్నది ఎతిహాద్‌ ఆలోచన. ఇందుకు సంబంధించి అనిల్‌ అంబానీ గ్రూపునకు ప్రతిపాదన పంపినట్టు తెలియవచ్చింది. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాల

స్థిరంగా పసిడి ధర

Tuesday 30th October 2018

డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలర్లు లాభంతో 1,228.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టిందనే కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ క్రమంగా పుంజుకుంటోంది. నేడు డాలర్‌

Most from this category