బెర్జర్ పెయింట్స్ లాభం రూ.117 కోట్లు
By Sakshi

హైదరాబాద్: బెర్జర్ పెయింట్స్ కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ క్వార్టర్లో 5.35 శాతం వృద్ధితో రూ.117.29 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.1,502 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.111.34 కోట్లు, ఆదాయం రూ.1,292 కోట్లుగా ఉంది. ఇవి జీఎస్టీతో కూడిన గణాంకాలు అని, క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు ఎక్సైజ్ డ్యూటీతో ఉన్నందున పోల్చి చూడకూడదని కంపెనీ పేర్కొంది. జీఎస్టీని మినహాయించి చూస్తే ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,282 కోట్ల నుంచి 16.3 శాతం వృద్ధితో రూ.1,490 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. తరుగుదల, వడ్డీ, పన్నులకు ముందుస్తు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.199 కోట్ల నుంచి రూ.207 కోట్లకు చేరినట్టు వెల్లడించింది.
You may be interested
హోమ్ థియేటర్.. ఎంటర్టైన్మెంట్ అడ్డా!
Thursday 15th November 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్, హాట్‌స్టార్, జీ, ఈరోస్, సన్... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంపెనీ తమకు ప్రత్యేక హక్కులున్న సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌తో ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయ్!!. కొన్ని కంపెనీలు కాస్త ముందుకెళ్లి సొంత కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. స్మార్ట్ టీవీల సాయంతో ఇంట్లోనే సినిమాలు చూసే జనం పెరుగుతుండటం వల్లే!! కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి... ఇళ్లనే థియేటర్లుగా మార్చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ కలిసో... బంధువులతోనో
ఫండ్ మేనేజర్స్ మెచ్చిన షేర్లు ఇవే..
Thursday 15th November 2018అక్టోబరులో సెన్సెక్స్ 5 శాతం నష్టపోయినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల జోరు మాత్రం ఈ సమయంలో నిలకడగా కొనసాగింది. మార్కెట్ పతనాన్ని ఒక అవకాశంగా చూసిన ఫండ్ మేనేజర్లు, నాణ్యమైన పలు షేర్లను కొనుగోలుచేశారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు 22.2 లక్షల కోట్లకు చేరుకోగా.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 45 శాతం, డెట్ ఫండ్స్ అసెట్స్ 31 శాతం, లిక్విడ్ ఫండ్స్ ఆస్తులు 20 శాతం పెరిగినట్లు