STOCKS

News


కార్డు చెల్లింపుల్లో హైదరాబాద్ ద్వితీయ స్థానం

Friday 19th July 2019
news_main1563523638.png-27182

  • రేజర్‌పే నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: డిజిటల్‌ యుగానికి అద్దం పడుతున్న నగరాల్లో బెంగళూరు టాప్‌ వన్‌ స్థానంలో నిలిచింది. పేమెంట్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ రేజర్‌పే నిర్వహించిన తాజా సర్వేలో ఈ నగరం మోస్ట్‌ డిజిటలైజ్డ్ సిటీల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది. ‘ఎరా ఆఫ్‌ రైజింగ్ ఫిన్‌టెక్’ పేరిట గురువారం విడుదలచేసిన సర్వేలో బెంగళూరు తరువాత వరుసగా హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ టాప్‌ స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మర్చెంట్‌ పేమెంట్‌ క్యాటగిరీలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల చెల్లింపుల వాటా 50 శాతంగా ఉంది. ఈ కాలంలో కార్డు చెల్లింపుల్లో వృద్ధి 22 శాతంగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. ఆహార, పానీయాల చెల్లింపులు 29 శాతం, గేమింగ్‌ ఇండస్ట్రీలో 15 శాతం, ఆర్థిక సేవల్లో 14 శాతం వృద్ధి నమోదైంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పతనం

Friday 19th July 2019

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 30515 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో జరిగిన స్వల్ప కొనుగోళ్ల కారణంగా ఇండెక్స్‌ 150 పాయింట్లు పెరిగి 30,543.75 వద్ద ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్లో జరిగిన అమ్మకాల సునామిలో భాగంగా ఇండెక్స్‌ 2శాతం(632 పాయింట్లు) క్షీణించి 30000 మార్కును కోల్పోయి 29,807.45 స్థాయిని పతనమైంది. ముఖ్యంగా

సిల్లీ మాంక్స్‌తో ఆరోస్‌ అవతార్‌ జట్టు

Friday 19th July 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ముంబై కేంద్రంగా ఉన్న ప్రొడక్షన్‌ హౌజ్‌ ఆరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. కంటెంట్‌ ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ సిల్లీ మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2013లో ప్రారంభమైన ఆరోస్‌ ఇప్పటివరకు మరాఠి, గుజరాతి, ఇంగ్లీషులో నాలుగు చిత్రాలను నిర్మించింది. ఇరు సంస్థలు కలిసి విభిన్న భాషల్లో చిత్రాలను రూపొందించనున్నాయి. తొలి సినిమా అశ్వమేధం త్వరలో విడుదల

Most from this category