STOCKS

News


బీపీఈఏ చేతికి ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో 30 శాతం వాటా

Tuesday 9th April 2019
news_main1554788362.png-25016

  • మరో 26 శాతానికి ఓపెన్‌ ఆఫర్‌ 
  • మొత్తం బీపీఈఏ వెచ్చించేది రూ.4,890 కోట్లు 

న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో 30 శాతం వాటాను బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా(బీపీఈఏ) కొనుగోలు చేయనున్నది. ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌, ఇతర ప్రమోటర్ల నుంచి ఈ వాటాను బీపీఈఏ అనుబంధ ఫండ్స్‌ కొనుగోలు చేయనున్నాయి. ఈ విషయాన్ని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ శనివారం పోద్దు పోయిన తర్వాత స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ తెలిపింది. ఒప్పందంలో భాగంఆ ఒక్కో షేర్‌ను రూ.1,394 ధరకు మొత్తం 30 శాతం వాటాకు సమానమైన 1.88 కోట్ల ఈక్విటీ షేర్లను బీపీఈఏ ఫండ్స్‌ కొనుగోలు చేస్తాయి. మ్తొం డీల్‌ విలువ రూ.2,627 కోట్లని పేర్కొంది. ఈ కొనుగోలు కారణంగా బీపీఈఏ అదనంగా మరో 26 శాతం వాటా(1.62 కోట్ల షేర్ల)ను కొనాల్సి వస్తుందని దీని కోసం బీపీఈఏ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నదని కూడా ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ వెల్లడించింది.  దీనిని కూడా కలుపుకుంటే బీపీఈఏ వెచ్చించే మొత్తం రూ.4,890 కోట్లకు చేరుతుంది. ఈ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థల ఆమోదాల పొందాల్సి ఉంటుంది. ఈ డీల్‌ విషయంలో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌కు క్రెడిట్‌ సూసీ ఆర్థిక సలహాదారుగా, శార్దూల్‌ అమర్‌చండ​ మంగళ్‌దాస్‌ అండ్‌ కో, న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నాయి. బీపీఈఏకు న్యాయ సలహాదారుగా జే సాగర​ అసోసియేట్స్‌, రోప్స్‌ అండ్‌ గ్రేలు వ్యవహరిస్తున్నాయి. You may be interested

ఫారిన్‌ ఫండ్లు వెళ్లిపోతున్నాయ్‌!

Tuesday 9th April 2019

భయపెడుతున్న క్రూడాయిల్‌ మార్చి మొత్తం భారత ఈక్విటీలు, బాండ్లలో కోట్ల రూపాయలు కుమ్మరించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్రమంగా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలో పెరుగుదల, తద్వారా రూపాయిపై పెరిగిన ఒత్తిడి.. ఎఫ్‌ఐఐలు నిధులు ఉపసంహరించుకునేలా చేస్తున్నాయి. మరోపక్క ఎన్నికల జాతర మొదలయ్యేందుకు సిద్ధంగా ఉండడంతో సూచీల్లో నెలకొన్న అస్థిరత కూడా ఎఫ్‌ఐఐలను ఆలోచింపజేస్తోంది. ఈ నెల ఇంతవరకు ఎఫ్‌ఐఐలు దాదాపు 78 కోట్ల డాలర్ల

లోక్‌సభ ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!

Tuesday 9th April 2019

- గురువారం (ఏప్రిల్‌ 11న) జరిగే తొలి విడత పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - శుక్రవారం ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు వెల్లడి - ఈవారంలోనే ఫిబ్రవరి ఐఐపీ, మార్చి ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు  - బుధవారం ఈసీబీ పాలసీ ప్రకటన, ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ విడుదల ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఈవారంలోనే తొలి

Most from this category