STOCKS

News


ఎన్‌సీఎల్‌టీకి జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ ఎనర్జీ ఎన్‌పీఏ కేసు!

Friday 7th September 2018
news_main1536297030.png-20052

ముంబై: జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ సహా 11 విద్యుత్‌ ప్రాజెక్టుల ఎన్‌పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్‌ పవర్‌ జనరేషన్‌, జై ప్రకాష్‌ పవర్‌ వెంచర్‌, ఎస్‌కేఎస్‌ ఇస్పాత్‌ పవర్‌, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్‌ వపర్‌ జబువా, కేఎస్‌కే మహానంది, కోస్టల్‌ ఎనర్జెన్‌, జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా సరే వాటిని ఎన్‌పీఏలుగా గుర్తించాలన్నది ఆర్‌బీఐ ఆదేశాల సారం. ఇలా ఎన్‌పీఏలుగా గుర్తించిన కేసుల్లో 180 రోజుల్లోపు బ్యాంకులు పరిష్కారం కనుగొనాలి. లేదా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి నివేదించాల్సి ఉంటుంది. దీంతో 11 ఎన్‌పీఏ ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి బ్యాంకులు నివేదించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. 



You may be interested

‘అమ్రపాలి’పై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లండి!

Friday 7th September 2018

న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఆశ్రయించడానికి కార్పొరేషన్‌ బ్యాంక్‌కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అమ్రపాలి గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు కార్పొరేషన్‌ బ్యాంక్‌ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఈ కేసులో తదుపరి ప్రొసీడింగ్స్‌ చేపట్టకూడదని ఎన్‌సీఎల్‌టీకి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నియంత్రణలు

కార్డ్‌ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్‌ విత్‌డ్రా

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కార్డ్‌ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ

Most from this category