News


అబెబ్బే.... అదేలా కుదురుతుంది!

Thursday 28th February 2019
news_main1551339201.png-24376

  • ఐటీ రిఫండ్స్‌తో బాకీ తీర్చడానికి
  • రుణదాతల విముఖత
  • ఎరిక్‌సన్‌కు రుణం కేసులో 
  • ఆర్‌కామ్‌కు తీవ్ర ఇబ్బంది

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్‌కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ‍ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్‌కామ్‌ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్‌కామ్‌ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్‌ క్రెడిటార్స్‌ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌)లో వినిపించారు.  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌కామ్‌.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనితో  సంస్థ ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిఫండ్స్‌ ఆర్‌కామ్‌ వినియోగంపై విధించిన మారటోరియంను తొలగించాలని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆర్‌కామ్‌ ఆశ్రయించింది. ఆయితే మారటోరియం తొలగించరాదని రుణ గ్రహీతలు తమ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ మార్చి  11న జరుగుతుంది. 8వ తేదీలోపు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)సహా కంపెనీ ఫైనాన్షియల్‌ క్రెడిటార్స్‌ తమ వాదనలను లిఖితపూర్వకంగా స‍మర్పించాల్సి ఉంటుంది. ఎరిక్‌సన్‌కు బకాయిల కేసులో ఇప్పటికే ఆర్‌కామ్‌ 118 కోట్లు డిపాజిట్‌ చేసింది. మిగిలిన మొత్తం రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుండా మూడు నెలలు కంపెనీ చీఫ్‌ అనిల్‌ అంబానీ, మరో ఇరుగ్రూపు సంస్థల డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ నెల 20తేదీన అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీనితో కంపెనీ నిధుల సమీకరణ ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.You may be interested

హ్యుందాయ్‌ క్రెటా విక్రయాల జోరు

Thursday 28th February 2019

5 లక్షల మైలురాయికి చేరిన అమ్మకాలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా’.. తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘క్రెటా’ విక్రయాలు 5 లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. 2015 జూలైలో విడుదలైన ఈకారు అమ్మకాలు ఇప్పటివరకు భారత్‌లో 3.7 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 1.4 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం నాటికి మొత్తంగా 5 లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని

రూ.20,000 కోట్ల జీఎస్టీ ఎగవేత

Thursday 28th February 2019

ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో గుర్తింపు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు రూ.20000 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10,000 కోట్ల మేర రికవరీ చేసినట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యుడు జాన్‌జోసెఫ్‌ తెలిపారు. మోసాల నివారణకు, నిబంధనలు పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం 5-10 శాతం మంది

Most from this category