STOCKS

News


ఆర్‌పీ4 రేటింగ్‌ కోసం ఎన్‌పీఏలపై 60 శాతం నష్టాలు

Thursday 13th September 2018
news_main1536813914.png-20221

ముంబై: ఆర్‌బీఐ స్వతంత్ర పరపతి మదింపు కార్యాచరణ (ఐసీఈ) పరిధిలో రూ.50,000 కోట్లకు పైగా ఎన్‌పీఏలుండగా, వీటికి పరిష్కార ప్రణాళిక అమలు కోసం ఆర్‌పీ4 రేటింగ్‌ అవసరమని, ఇందుకు బ్యాంకులు 40- 60 శాతం నష్టపోవాల్సి (హేర్‌కట్‌) ఉంటుందని అసోచామ్‌-క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. జూన్‌ నాటికి ఎన్‌సీఎల్‌టీ 32 ఎన్‌పీఏల పరిష్కార ప్రణాళికలకు ఆమోదం తెలియజేయగా, రూ.89,400 కోట్ల క్లెయిమ్‌లకు గాను పరిష్కారం రూ.50,000 కోట్ల వరకే ఉండడం గమనార్హం. అంటే మిగిలిన మేర హేర్‌కట్‌ రూపంలో నష్టపోయాయి. 



You may be interested

టెక్నాలజీపై అతిగా ఆధారపడొద్దు..

Thursday 13th September 2018

ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాల మంజూరీలో టెక్నాలజీపై అతిగా ఆధారపడరాదని, ఉద్యోగులు వివేచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ పేర్కొన్నారు. దరఖాస్తుదారు అర్హతలను మదింపు చేసే విషయంలో కంప్యూటర్ ఆల్గోరిథమ్స్‌, క్రెడిట్ బ్యూరోలిచ్చే స్కోర్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ మొదలైన వాటిపై మరీ ఎక్కువగా ఆధారపడకూడదని ఆయన సూచించారు. వీటిని తారుమారు చేసే అవకాశాలూ ఉన్నాయన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా విభ పదాల్కర్

Thursday 13th September 2018

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా విభ పదాల్కర్‌ నియమితులయ్యారు. సెప్టెంబర్‌ 8న అమితాబ్ చౌదరి ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ), ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విభ పదాల్కర్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బుధవారం విధులు చేపట్టిన ఆమె పదవీకాలం మూడేళ్లు ఉంటుందని వెల్లడించింది.   

Most from this category