News


సోమవారం బ్యాంకులు సెలవు!

Saturday 30th March 2019
news_main1553933544.png-24872

ముంబై: బ్యాంకులు ఏప్రిల్‌ 1వ తేదీ సోమవారం పనిచేయవు. మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఖాతాల ముగింపును (యాన్యువల్‌ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌) పురస్కరించుకుని వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని ఆర్‌బీఐ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ లావాదేవీలకు ఆదివారం సేవలు
కాగా ఆర్థిక సంవత్సరం చివరిరోజుకావడంతో (మార్చి 31) ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు  సంబంధింత ప్రత్యేక బ్యాంక్‌ బ్రాంచీలు పనిచేస్తాయి. ‘‘పే అండ్‌ అకౌంట్‌ బ్యాంక్‌ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయలని కేంద్రం సూచించింది’’ అని ఆర్‌బీఐ ఒక సర్కులర్‌లో తెలిపింది. దీనిప్రకారం ప్రభుత్వ ఆదాయాలు, చెల్లింపులు (గవర్నమెంట్‌ బిజినెస్‌) నిర్వహించే బ్రాంచీలు అన్నీ, సంబంధిత కార్యకలాపాల నిమిత్తం మార్చి 30వ తేదీ రాత్రి  8 గంటల వరకూ పనిచేస్తాయి, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకూ విధులు నిర్వహిస్తాయి. ఆర్‌టీజీఎస్‌, నిఫ్ట్‌ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించడం జరిగింది.



You may be interested

3 లక్షల డీ రిజిస్టర్డ్‌ సంస్థలపై దర్యాప్తు

Saturday 30th March 2019

ఐటీ శాఖను కోరిన సీబీడీటీ పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ నిగ్గు తేల్చాలని ఆదేశం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ రద్దు చేసిన మూడు లక్షల సంస్థలపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలు పన్ను ఎగవేతతోపాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడ్డాయా అన్నది తేల్చాలని కోరింది. దీన్నో ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టాలని

భారత కంపెనీలకు విదేశీ నిధుల బూస్ట్‌

Saturday 30th March 2019

జోరుగా ఈక్విటీల అమ్మకాలు గత నెల రోజుల్లోనే రూ.23,000 కోట్ల డీల్స్‌ ఆఫర్‌ సేల్‌, క్యూఐపీ ఆఫర్లు ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్ల వాటాల అమ్మకాలు ఐపీవో మార్కెట్‌కూ అనుకూల పరిస్థితులు  న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్‌

Most from this category