STOCKS

News


బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తి అవసరం

Friday 12th April 2019
news_main1555046645.png-25083

  • సామర్థ్యం మెరుగుదలకు బీబీబీ సూచన

న్యూఢిల్లీ: మెరుగైన సామర్థ్యం, వ్యవస్థీకృత పటిష్టత వంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) సూచించింది. బీపీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌ టైమ్‌ డైరెక్టర్ల నియామక అత్యున్నత సంస్థ- బీబీబీ,  మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్ రుణ వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. రుణ వ్యయాలు మరింత తగ్గాలని, రుణ ఆమోదం, కేటాయింపులు, పంపిణీల విషయంలో బ్యాంకింగ్‌ సామర్థ్యం మెరుగుపడాలని సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ స్కీమ్‌ ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఉండాలని పేర్కొంది. మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకింగ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్ల నియమకాలు జరిగాయని నివేదిక పేర్కొంటూ, సకాలంలో బీబీబీ ఇచ్చిన సిఫారసులు దీనికి కారణమని తెలిపింది. ప్రభుత్వ రంగ  బ్యాంకుల హోల్‌టైమ్‌ డైరెక్టర్లు అలాగే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నియామకాలకు తగిన సిఫారసులు చేయడానికి నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో బీబీబీ ఏర్పాటుకు 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డ్‌ డైరెక్టరలతో చర్చించి, విలీనాలు సహా బ్యాంకింగ్‌ రంగ పురోగతికి తగిన వ్యూహ రూపకల్పనలోనూ బీబీబీ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. 



You may be interested

మరింత సంక్షోభంలో జెట్‌

Friday 12th April 2019

మరింత సంక్షోభంలో జెట్‌ - మరో 10 విమానాల నిలిపివేత - లీజు కట్టకపోవడమే కారణం - 26% వాటాలు తనఖా పెట్టిన నరేష్ గోయల్  న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తాజాగా లీజు అద్దెలు చెల్లించకపోవడంతో మరో 10 విమానాలు నిలిపివేయాల్సి వచ్చినట్లు సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో ఇలా నిల్చిపోయిన విమానాల సంఖ్య 79కి చేరింది. అయినప్పటికీ కార్యకలాపాలు సజావుగా సాగించే క్రమంలో

డిజిటల్‌ గోల్డ్‌కు ఆదరణ

Friday 12th April 2019

డిజిటల్‌ గోల్డ్‌కు ఆదరణ విస్తరిస్తున్న మార్కెట్‌ ఏటా తొమ్మిది టన్నుల విక్రయాలు మూడు టన్నుల మేర డెలివరీ బరిలో పేటీఎం, గూగుల్‌పే, మోతీలాల్‌ ఈ మార్కెట్లో అవకాశాలపై కన్ను న్యూఢిల్లీ: బంగారం డిజిటల్‌ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ గోల్డ్‌ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012-13లో బంగారం డిజిటల్‌ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Most from this category