STOCKS

News


గామన్ చైర్మన్ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోండి

Friday 12th October 2018
news_main1539318406.png-21070

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సంస్థ గామన్ ఇండియా భారీ స్థాయిలో రుణాలు డిఫాల్ట్ అయిన నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ అభిజిత్ రాజన్ విదేశాలకు జారుకోకుండా పాస్‌పోర్టును జప్తు చేయాలని పాస్‌పోర్టు అధికారులను బ్యాంకులు కోరాయి. ఆయన పాస్‌పోర్టు వివరాలను కన్సార్షియంలో లీడ్ బ్యాంకరు.. అధికారులకు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గామన్ ఇండియాకి ఇచ్చిన సుమారు రూ. 7,000 కోట్ల రుణాలు ప్రస్తుతం నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారినట్లు వివరించాయి. మరోవైపు, ఈ వార్తలపై గామన్ ఇండియా వర్గాలు స్పందిచడానికి నిరాకరించాయి. 
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు మళ్లీ చోటుచేసుకోకుండా కేంద్రం ఆర్థిక నేరగాళ్ల పలాయన నిరోధక చట్టం చేసిన సంగతి తెలిసిందే. దీని కింద రూ.50 కోట్ల పైబడిన రుణాలు తీసుకున్న రుణగ్రహీతల పాస్‌పోర్ట్ వివరాలు కూడా తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఒకవేళ సదరు రుణగ్రహీతలు బాకీలు ఎగ్గొట్టి విదేశాలకు పరారయ్యే ఆలోచనలో ఉన్న పక్షంలో అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా, దాదాపు రూ.270 కోట్ల మేర బాకీలు ఎగ్గొట్టిన ఇద్దరు లగ్జరీ కార్‌ బ్రాండ్ డీలర్లను వేరే దేశాలకు పారిపోకుండా గత నెలలో అధికారులు అడ్డుకోగలిగారు. ఆగస్టు 29న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తమ డీలర్‌షిప్‌లు లాభాల్లో ఉన్నాయంటూ ఈ రుణాలు తీసుకున్న ఇద్దరూ.. ఆ తర్వాత తాము గత నాలుగేళ్లుగా నష్టాలు వస్తున్నందున రుణం కట్టలేమంటూ ఆగస్టు 28న ఈ-మెయిల్ రాయడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ ఫిర్యాదు చేసింది. You may be interested

వచ్చే నెల 15న ‘జావా’ మోటార్ సైకిల్ రీఎంట్రీ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: గతంలో ఒక వెలుగువెలిగిన ‘జావా’ మోటార్‌ సైకిల్‌ త్వరలోనే మళ్లీ మర రోడ్లపై రయ్‌మంటూ దూసుకుపోనుంది. మహీంద్రా గ్రూపునకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1929 నాటి ఈ బైక్‌లను వచ్చే నెల 15న విడుదలచేసేందుకు సిద్ధమైంది. ఈ బైక్‌ల అధునాతన 293 సీసీ ఇంజిన్‌ను గురువారం ప్రదర్శించింది. చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌ నగరానికి చెందిన ఆనాటి మోటార్ సైకిల్‌ ఇంజిన్‌ను ఇటలీ, పూణే ఆర్‌ అండ్‌

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టీసీఎస్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌

Most from this category