STOCKS

News


దివాలా అంచున దిగ్గజాలు..

Saturday 25th August 2018
news_main1535170963.png-19617

ఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది.  దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్‌లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్‌ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఆర్‌బీఐ సర్క్యులర్‌ ప్రభావం.. 
రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న రిజర్వ్‌ బ్యాంకు సర్క్యులర్‌ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్‌ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం దాని ప్రభావంతోనే పలు కంపెనీలు దివాలా చట్టం చర్యల ముంగిట్లో ఉన్నాయి. ఆర్‌బీఐ విధించిన 180 రోజుల వ్యవధి మార్చి 1తో మొదలై ఆగస్టుతో ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్‌ ప్రారంభం కాగానే బ్యాంకులు సదరు మొండి ఖాతాలపై దివాలా చట్టం కింద చర్యలు మొదలుపెట్టాల్సి రానుంది. మార్చి 1 నాటికి ఒక్క రోజు పైగా రుణాలు డిఫాల్ట్‌ అయిన దాదాపు 70–75 ఖాతాల పరిష్కారానికి బ్యాంకులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, వీటిలో చాలా మటుకు ఖాతాలు ఒక కొలిక్కి రాలేదని, దీంతో వచ్చే రెండు వారాల్లో ఆయా సంస్థలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానుందని సంబంధిత వర్గాలు వివరించాయి. 

60 ఖాతాల్లో కొన్ని..
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానున్న సంస్థల్లో .. పంజ్‌ లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్, పటేల్‌ ఇంజినీరింగ్, బాంబే రేయాన్, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోల్టా ఇండియా, శ్రీరామ్‌ ఈపీసీ, గీతాంజలి జెమ్స్‌ మొదలైనవి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని సంస్థలు గతంలో కూడా బ్యాంకింగ్‌పరమైన చర్యలు ఎదుర్కొన్నాయి. దాదాపు రూ. 14,000 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌లో గీతాంజలి జెమ్స్‌ కూడా విచారణ ఎదుర్కొంటోంది. ఇక జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాంబే రేయాన్, శ్రీరామ్‌ ఈపీసీ మొదలైనవి గతంలోనే కార్పొరేట్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ వంటి పాత స్కీములను ఉపయోగించుకున్నాయి. మరోవైపు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే విద్యుత్‌ రంగానికి చెందిన ఆరు ఖాతాల పరిష్కార స్కీములను ఖరారు చేయగలిగినట్లు సమాచారం. ఇందులో కోస్టల్‌ ఎనర్జెన్, జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ మొదలైనవి ఉన్నట్లు తెలుస్తోంది. 



You may be interested

షాపింగ్‌ బిల్లుపై రూపీ ప్రభావం

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3-6 శాతం స్థాయిలో పెంచేందుకు

రూపాయి రికవరీ

Saturday 25th August 2018

రూపాయి శుక్రవారం రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ఇండియన్ మార్కెట్‌లో 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగిసింది. కార్పొరేట్స్‌, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌లోని తీవ్రమైన ఒడిదుడుకులు రూపాయిపై త్రీవంగా ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం 70.20 వద్ద ప్రారంభమైన రూపాయి తర్వాత ఒకానొక సమయంలో 70.24 స్థాయికి కూడా పతనమైంది. అమెరికా-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ముగిసిన

Most from this category