ఆర్బీఐ ఇచ్చిన పరిష్కార గడువు నేటితో ముగింపు
By Sakshi

ముంబై: భారీ మొండి బకాయి ఖాతాల (ఎన్పీఏలు) విషయంలో ఆర్బీఐ విధించిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసిపోనుంది. సుమారు 70 ఖాతాలకు సంబంధించి రూ.3.8 లక్షల కోట్ల రుణాలకు బ్యాంకులు పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వాటిని ఎన్సీఎల్టీ పరిష్కారానికి నివేదించక తప్పనిసరి పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు చివరి క్షణంలో వీటికి సంబంధించి పరిష్కారం కోసం తమ చర్యల్ని వేగవంతం చేశాయి. ఈ ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ కంపెనీలవి కాగా, ఈపీసీ, టెలికం కంపెనీలవీ ఉండడం గమనార్హం. అయితే, ఎన్సీఎల్టీకి నివేదించే విషయంలో బ్యాంకులు సుముఖంగా లేవు. ఎందుకంటే ఇప్పటికే ఎన్సీఎల్టీకి సిఫారసు చేసిన ఖాతాల విషయంలో బ్యాంకులు ఎక్కువ హేర్కట్ (ఒక రుణంపై నష్టం) ఎదుర్కోవాల్సి వచ్చింది. అలోక్ ఇండస్ట్రీస్ ఎన్పీఏ ఖాతాలో ఈ హేర్కట్ 86 శాతంగా ఉండడం గమనార్హం. అంటే బ్యాంకులు తామిచ్చిన రుణంలో 86 శాతాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి. రుణ గ్రహీతలు చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించి, నాటి నుంచి 180 రోజుల్లోపు (ఆరు నెలలు) పరిష్కారాన్ని కనుగొనాలన్నది ఆర్బీఐ ఆదేశాల సారం. ఈ ఆదేశాలు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి రాగా, నాటికి ఎన్పీఏలుగా ఉన్న ఖాతాలకు గడువు ఆగస్ట్ 27తో తీరిపోనుంది. ఒకవేళ సోమవారం నాటికి పరిష్కారం లభించకపోతే ఎన్సీఎల్టీ ముందు నమోదు చేసి, దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చివరి క్షణంలోపు అవకాశం ఉన్నంత మేరకు పరిష్కారం కోసం బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో కొన్నింటికి పరిష్కార ప్రణాళికలను ఖరారు చేసినట్టు బ్యాంకర్లు పేర్కొన్నారు.
అలహాబాద్ హైకోర్టులో విచారణ పెండింగ్
రూ.3.8 లక్షల కోట్ల ఎన్పీఏల్లో మూడో వంతు విద్యుత్ కంపెనీలవి కాగా, ఇవి ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. విషయం కోర్టు విచారణ పరిధిలో ఉంది. దీంతో తమకు మరింత సమయం లభిస్తుందని బ్యాంకర్లు ఆశలు పెట్టుకున్నారు. కొన్ని బ్యాంకులు పరిష్కార ప్రణాళికను రూపొదించగా, మరికొన్ని ఇదే పనిలో ఉన్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. చాలా వరకు బ్యాంకులు పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపేందుకు లేదా డిఫాల్టింగ్ కంపెనీలకు రుణ సదుపాయం ఇచ్చేందుకు గాను సోమవారం బోర్డు సమావేశాలు ఏర్పాటు చేశాయని చెప్పారు. ఎన్నింటికి పరిష్కారం కొనుగొన్నది, ఎన్ని కేసులను ఎన్సీఎల్టీకి సిఫారసు చేసేదీ సోమవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, రూ.3.5 లక్షల కోట్లు విలువైన సుమారు 60 ఎన్పీఏ ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తోంది.
You may be interested
స్థిరంగా పసిడి
Monday 27th August 2018డాలర్ స్వల్ప పతనం కారణంగా ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియమ్లో శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగిస్తూ ‘‘వడ్డీరేట్లు పెంపు వ్యవస్థలో ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తుంది. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు జాప్యం చేస్తే వ్యవస్థలో స్థిరీకరణ దెబ్బతింటుంది. కాబట్టి క్రమపద్ధతిలోనే వడ్డీ రేట్లను పెంచుతాము. అని అన్నారు. పావెల్ ప్రకటన అనంతరం డాలర్ ఒత్తిడి పెరిగింది. ఆరు ప్రధాన కరెన్సీలతో
జెట్ ఎయిర్వేస్పై కార్పొరేట్ శాఖ దృష్టి..
Monday 27th August 2018ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దృష్టి సారించింది. ఆర్థిక ఫలితాలను వాయిదావేసిన అంశంతో పాటు మరికొన్ని విషయాల గురించి వివరణనివ్వాలంటూ కంపెనీతో పాటు ఆడిటర్లకు కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సూచించింది. ఎంసీఏలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో వివరాలను మాత్రమే కోరినట్లు, ఖాతాల తనిఖీ లేదా విచారణ జరపడంలాంటి అంశాలపై ఇంకా