STOCKS

News


జెట్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి

Saturday 20th April 2019
news_main1555736576.png-25237

- 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు చూడాలి
- బ్యాంకులపై భారం మోపొద్దు
- ప్రధానికి బ్యాంకు ఉద్యోగుల సంఘం అభ్యర్థన
జెట్‌ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలపై దర్యాప్తునకు డిమాండ్‌

ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్‌ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్‌ ఎయిర్‌వేస్‌ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్‌ బెయిలవుట్‌ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్‌ గోయల్‌ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్‌గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్‌ గోయల్‌ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది.



You may be interested

అమెజాన్‌, గూగుల్ దోస్తీ

Saturday 20th April 2019

ఫైర్‌టీవీలో యూట్యూబ్‌ క్రోమ్‌క్యాస్ట్‌లో ప్రైమ్ వీడియోలు న్యూఢిల్లీ:  టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్‌ ఫైర్‌ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్‌ క్రోమ్‌క్యాస్ట్‌ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్‌

వినోద రాజ్యంలో యాప్‌లే ‘టాప్‌’

Saturday 20th April 2019

 - 2021 నాటికి రూ.35,400 కోట్లకు మార్కెట్‌ - ప్రస్తుతం 30 పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు - రూ. 25 నుంచి ప్యాకేజీలు ప్రారంభం - ఈ ఏడాది సినిమాను దాటేయనున్న ఓటీటీ - భారీ పెట్టుబడులతో వస్తున్న సంస్థలు బ్యాండ్‌విడ్త్‌ కోసం బెగ్గింగ్‌ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్‌లోడ్‌

Most from this category