STOCKS

News


నేడు పీఎస్‌యూ బ్యాంక్‌ ఉద్యోగుల నిరసన

Tuesday 9th October 2018
news_main1539059583.png-20958

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న జరిగిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిరసన ప్రదర్శనల అనంతరం అక్టోబరు 12న మరోసారి ముంబైలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు.



You may be interested

15 నుంచి గోల్డ్ బాండ్స్‌ స్కీమ్‌

Tuesday 9th October 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.  తదుపరి విడతల తేదీలు నవంబర్ 5-19 (నవంబర్ 13న జారీ), డిసెంబర్‌ 24-28 (జారీ జనవరి 1), జనవరి 14-18 (జారీ జనవరి

నాలుగు ఐపీఓలకు సెబీ ఆమోదం

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తాజాగా నాలుగు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఆమోదం తెలిపింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పురానిక్‌ బిల్డర్స్‌, ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ నిహిలంత్‌, ముత్తూట్‌ గ్రూప్‌కు చెందిన సూక్ష్మ రుణ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది. ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఐపీఓ సైజు రూ.2,000 కోట్లు  ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ

Most from this category