STOCKS

News


బ్యాంకు నిఫ్టీ 1.65శాతం అప్‌

Friday 26th April 2019
news_main1556270046.png-25370

బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 1.65 శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన ఈ ఇండెక్స్‌ నేడు 29,764.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్థిరమైన ర్యాలీ కారణంగా ఇంట్రాడేలో 1.65శాతం పైగా జంప్‌ చేసి 30037.90 స్థాయిని తాకింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల లాభపడి ఇండెక్స్‌ ర్యాలీకి సహకరించాయి. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,561.35)తో పోలిస్తే 1.25శాతం లాభంతో 29,938.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 2.50శాతం పెరగ్గా, ఎస్‌బీఐ 2శాతం, కోటక్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం లాభపడ్డాయి. అలాగే పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు 1.50శాతం క్షీణించగా, యస్‌బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ

Friday 26th April 2019

రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ ఏప్రిల్‌ నెలలో ఊరించిన నిఫ్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ 12,000 పాయింట్ల స్థాయిని మే నెలలో అందుకోవొచ్చన్న సంకేతాలు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్‌ రోలోవర్స్‌ సూచిస్తున్నట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. మార్చి నెలలో భారీ ర్యాలీ జరిగిన తర్వాత ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌కు భారీగా లాంగ్‌ పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయని, అవి అలాగే కొనసాగించిన బుల్స్‌, వాటిని తిరిగి మే సిరీస్‌కు రోలోవర్‌ చేసినట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌

3వారాల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు

Friday 26th April 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన సహచర ప్రైవేట్‌ రంగ బ్యాంకు కోటక్‌ యాక్సిక్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఈ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించన స్థాయిలో నమోదు కావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 2.50శాతం పెరిగి రూ.405ల వద్ద ఇంట్రాడే

Most from this category