STOCKS

News


'వీడియోకాన్' యూనిటీ అప్లయెన్సెస్ ఆస్తుల విక్రయం

Wednesday 13th March 2019
news_main1552461895.png-24583

న్యూఢిల్లీ: దాదాపు రూ. 154 కోట్ల రుణాలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన యూనిటీ అప్లయెన్సెస్‌ స్థిర, చరాస్తులను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) వేలానికి ఉంచింది. 2018 జనవరి 5 నుంచి యూనిటీ అప్లయెన్సెస్ సంస్థ రూ. 153.77 కోట్లతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకు తెలిపింది. ఈ సంస్థ తమిళనాడులోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎయిర్ కండీషనర్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలను తయారు చేస్తోంది. దీనికి వీడియోకాన్ ఇండస్ట్రీస్‌, దాని ప్రమోటరు వేణుగోపాల్ ధూత్‌ గ్యారంటర్లుగా ఉన్నారు. స్థలం, యంత్రాలను మార్చి 30న వేలం వేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. స్థలానికి రూ.42.34 కోట్లు, ప్లాంటు.. యంత్రాలకు రూ.72.82 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు వివరించింది. యూనిటీ అప్లయెన్సెస్‌ వేలానికి బ్యాంకు ఈ-ఆక్షన్ నోటీసునివ్వడం ఇది రెండోసారి. భారీ రుణభారంతో వీడియోకాన్ గ్రూప్ తీవ్ర సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే.



You may be interested

మళ్లీ 1300డాలర్ల పైకి పసిడి ధర

Wednesday 13th March 2019

బ్రెగ్జిట్‌ ఆందోళనల నేపథ్యంలో పసిడి ధర తిరిగి 1300డాలర్లపైకి చేరుకుంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 7.50డాలర్లు లాభపడింది. యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించి ప్రధానమంత్రి థెరెసా మే రూపొందించిన ముసాయిదా ఒప్పందాన్ని పార్లమెంటు తిరస్కరించింది. మొత్తం 391 సభ్యులున్న హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో థెరెసా ప్రతిపానను 242 మంది సభ్యులు తిరస్కరించారు.  ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి తుది గడువు అయిన మార్చి 29వ

ఎస్‌బీఐ మొండిబకాయిల వేలం షురూ!

Wednesday 13th March 2019

22, 26 తేదీల్లో  రూ.3,640 కోట్లకుపైగా ఎన్‌పీఏల వేలం ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) వేలాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వేగవంతం చేసింది. దీని ప్రకారం మార్చి 26న రూ.2,338 కోట్ల విలువైన మొండిబకాయిల వేలాన్ని నిర్వహించనుంది. బ్యాంకులు, ఏఆర్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇతర ఆర్థిక సంస్థలకు పూర్తి 100 శాతం నగదు ప్రాతిపదికన ఎన్‌పీఏ అకౌంట్లను విక్రయించనున్నట్లు మంగళవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. విక్రయించనున్న అకౌంట్లలో ఇండియన్‌ స్టీల్‌

Most from this category