News


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.1,156 కోట్లు

Tuesday 13th November 2018
news_main1542085025.png-21925

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను చవిచూసింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.179 కోట్లు, ఈ క్యూ1లో రూ.95 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.11,600 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.10,800 కోట్లకు తగ్గిందని తెలిపింది. 
తగ్గిన రుణ నాణ్యత...
 గత క్యూ2లో రూ.49,307 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.61,561 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. నికర మొండి బకాయిలు రూ.23,566 కోట్ల నుంచి రూ.25,994 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఇక శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 12.62 శాతం నుంచి 16.36 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 6.47 శాతం నుంచి 7.64 శాతానికి పెరిగాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అయితే ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.66 శాతంగా, నికర మొండి బకాయిలు 8.45 శాతంగా ఉన్నాయని, సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల, నికర  మొండి బకాయిలు తగ్గాయని వివరించింది.  మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,867 కోట్ల నుంచి రూ.2,828 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ2లో నికర నష్టాలు భారీగా రావడంతో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 4.8 శాతం నష్టంతో రూ.87 వద్ద ముగిసింది. 



You may be interested

బ్రిటానియా లాభం రూ.303 కోట్లు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.261 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.303 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి

సింగపూర్‌ ఫిన్‌టెక్‌ వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగం

Tuesday 13th November 2018

సింగపూర్‌: సింగపూర్‌లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ ఫిన్‌టెక్‌ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్‌ కంపెనీలకు చెందిన సుమారు 30,000 మంది ఇందులో పాల్గొంటారు. ప్రపంచంలో ఇంత భారీ సమ్మేళనం మరొకటి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మన దేశం నుంచి 400 మంది హాజరుకానున్నారు. అలాగే, 18 కంపెనీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతా లేకపోయినా

Most from this category