బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రొవిజనింగ్ సెగ
By Sakshi

- క్యూ3లో రూ. 4,738 కోట్లకు ఎగిసిన నష్టాలు
ముంబై: మొండిబాకీలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నష్టాలు మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 4,738 కోట్లకు ఎగిశాయి. 40 భారీ మొండి పద్దులపై దివాలా చట్టం కింద విచారణ జరుగుతుండటం, కొత్తగా ఐఎల్అ౾ండ్ఎఫ్ఎస్ సంక్షోభం రూపంలో మొండిబాకీలు మరింతగా పెరగడం ఇందుకు కారణం. భారీ మొండిబాకీల కారణంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న బీవోఐ.. 2017 డిసెంబర్ క్వార్టర్లో రూ. 2,341 కోట్ల నష్టాలు నమోదు చేసింది. తాజాగా ఐఎల్అ౾ండ్ఎఫ్ఎస్ గ్రూప్‌నకు ఇచ్చిన రూ. 3,400 కోట్ల మేర రుణాలు మొండిబాకీల కింద వర్గీకరించాల్సి వచ్చింది.
దాదాపు రూ. 94,000 కోట్ల పైగా రుణభారం ఉన్న ఐఎల్అ౾ండ్ఎఫ్ఎస్ గ్రూప్.. సెప్టెంబర్ నుంచి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ముందుజాగ్రత్తగా కొన్ని మొండిపద్దులకు పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడంతో కేటాయింపులు రూ. 4,373 కోట్ల నుంచి రూ. 9,179 కోట్లకు ఎగిశాయని బీవోఐ ఎండీ దీనబంధు మహాపాత్ర తెలిపారు. మరోవైపు, క్యూ3లో వడ్డీ ఆదాయం 33.23 శాతం పెరిగి రూ. 3,332 కోట్లకు చేరిందని చెప్పారు. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 16.93 శాతం నుంచి 16.31 శాతానికి, నికర ఎన్పీఏలు 10.29 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి.
You may be interested
1300 డాలర్ల పైనే పసిడి
Tuesday 29th January 2019అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల అండతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 0.05 స్వల్ప పెరుగుదలతో 1,303.15 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించిన కేసులో చైనా దేశపు హువాయ్ టెక్నాలజీస్ సంస్థ సీఎఫ్ఓతో పాటు మరో ఇద్దరు అధికారులపై అమెరికా న్యాయ విభాగం చార్జ్‌షీట్ ధాఖలు చేసింది.
పీఎస్‌యూ బ్యాంకుల ఛీప్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
Tuesday 29th January 2019న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరగున్న తదుపరి మానిటరీ పాలసీ సమీక్షకు ముందు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకులతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్బీఐ ఏమి కోరుకుంటుందన్నది వారికి ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన చివరి ద్వైమాసిక పాలసీ సమీక్షను ఫిబ్రవరి 7న ప్రకటించనుంది. ‘‘బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలియజేయడం, బ్యాంకింగ్ రంగ పరిస్థితులపై