News


బీమా జేవీలో బీఓఐ వాటా విక్రయం!

Friday 21st December 2018
news_main1545368458.png-23123

ముంబై: బీమా రంగ జాయింట్‌ వెంచర్‌లో తన వాటాను విక్రయించి రూ. 1000 నుంచి రూ.1200 కోట్లు సమీకరించాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తున్నట్లు తెలిసింది. 2009లో దైచీ బీమా కంపెనీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక బీమా రంగ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. స్టార్‌ యూనియన్‌ దైచీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరిట ఏర్పాటైన ఈ జేవీలో దైచీకి 45.94 శాతం, యూబీఐకి 25.10 శాతం, బీఓఐకి 28.96 శాతం వాటాలున్నాయి. రెండేళ్ల క్రితం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జేవీలో 18 శాతం వాటాను దైచీ లైఫ్‌కు రూ.540 కోట్లకు విక్రయించింది. ఇప్పుడు మిగిలిన మొత్తం వాటాను విక్రయించి జేవీ నుంచి బయటకు వచ్చేందుకు త్వరలో బీఓఐ ప్రతిపాదన తీసుకురానున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పెద్ద పురోగతి చూపే ప్రదర్శన జరపలేదు. బీమా రంగంలో ఈ జేవీ వాటా చాలా స్వల్పంగా ఉంది. దీంతో బీమా రంగం నుంచి వైదొలగాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తమ వాటా కొనుగోలు చేసే ఆలోచన ఉంటే చెప్పాలని ఇప్పటికే దైచీ సంస్థకు బ్యాంకు లేఖ రాసినట్లు తెలిసింది. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం బీమా రంగంలో విదేశీ సంస్థకు 49 శాతానికి మించి వాటా ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఇతర కొనుగోలుదారుల కోసం బ్యాంకు అన్వేషించనుంది. వాటా విక్రయం పూర్తయితే ఆర్‌బీఐ పీసీఏ కింద ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కాస్త ఊరట లభించనుంది. బీమా రంగంతో పాటు ఎస్‌టీసీఐ ఫైనాన్స్‌, సిడ్బిల్లో తన వాటాను అమ్మేసేందుకు బ్యాంకు యత్నాలు ఆరంభించింది. బీఓఐకి ఎస్‌టీసీఐలో 29.96 శాతం, సిడ్బిలో 2.84 శాతం వాటాలున్నాయి. వీటి విక్రయంతో దాదాపు రూ.800 కోట్లు సమీకరించాలని బ్యాంకు భావిస్తోంది. కానీ బ్యాంకు ఆశించినంత మొత్తాలు చెల్లించి ఈ వాటాలు కొనేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడంలేదని అంతర్గత వర్గాలు తెలిపాయి. 
 



You may be interested

పార్లమెంట్‌ ముందుకు కంపెనీల చట్ట సవరణ బిల్లు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: కంపెనీ యాక్ట్‌ను సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వ్యాపారనుకూల వాతావరణం మెరుగుపరచేందుకు వీలుగా కంపెనీల చట్టాన్ని సవరించనున్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే గత నవంబర్‌లో జారీ చేసిన కంపెనీల సవరణ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లుతుంది. కొత్త సవరణలతో ప్రత్యేక కోర్టులపై అదనపు భారం తగ్గనుంది. తాజా సవరణల ప్రకారం 16 రకాల కార్పొరేట్‌ నేరాల విచారణ అధికారం ప్రత్యేక కోర్టుల నుంచి ఇన్‌-హౌస్‌ ఎడ్జుడికేషన్‌కు

స్టార్టప్స్‌కు గుజరాత్‌ బెస్ట్‌

Friday 21st December 2018

న్యూఢిల్లీ: కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లు స్టార్టప్స్‌ స్థాపించుకునేందుకు కావలిసిన వసతుల కల్పనలో గుజరాత్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాకింగ్స్‌ ఇచ్చింది. స్టార్టప్‌ పాలసీ, ఇంక్యుబేషన్‌ హబ్స్‌, ఇన్నోవేషన్స్‌, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్‌మెంట్‌, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే

Most from this category