STOCKS

News


విదేశీ శాఖలను మూసేయనున్న బీఓబీ

Tuesday 18th December 2018
news_main1545110246.png-23033

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వచ్చే ఏడాది జూన్‌ నాటికి మూడు విదేశీ బ్రాంచ్‌లను మూసేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విదేశీ శాఖల హేతుబద్ధీకరణ, సామర్థ్య పెంపు, లాభదాయకతల దృష్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్‌ ఏకీకృత వ్యాపారంలో ఒక శాతానికి తక్కువగా లాభాలను అందిస్తున్న గుయానా (దక్షిణ అమెరికా), ట్రినిడాడ్ అండ్‌ టొబాగో (కరేబియన్), ఘనా (పశ్చిమ ఆఫ్రికా) శాఖలను మూసివేస్తున్నట్లు తెలిపింది. భారత కరెన్సీ పరంగా గుయానా బ్రాంచ్‌ రూ.75.31 కోట్లు, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో శాఖ రూ.23.90 కోట్లు, ఘనా రూ.26.38 కోట్లు మాత్రమే ఆదాయాన్నిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఎంతకాలానికి ఈ మొత్తం అన్న సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఏడాది జనవరి 31 నాటికి అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్స్, ప్రతినిధి కార్యాలయాలతో కలుపుకుని దేశీ బ్యాంకులు 165 విదేశీ శాఖలను కలిగి ఉన్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 52 విదేశీ శాఖలను కలిగి ఉండగా.. ఆ తరువాత స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 50 శాఖలను కలిగి ఉంది.



You may be interested

ఇక ఈడీలూ ఎస్‌బీఐ ఎండీలు కావచ్చు!

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నియామకాలకు సంబంధించి కేంద్రం సోమవారం కీలక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం- జాతీయ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లనూ (ఈడీ) ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా ఎంపిక చేయవచ్చు. ఇప్పటి వరకూ ఎస్‌బీఐ ఎండీ కావాలంటే, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లకు (డీఎండీ) మాత్రమే అవకాశం ఉండేది. సంప్రదాయకంగా

ఈ కామర్స్‌కు ఫ్యాషన్‌, మొబైల్స్‌ కిక్కు

Tuesday 18th December 2018

ముంబై: మన దేశంలో ఆన్‌లైన్‌లో హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యేవి ఏవనుకుంటున్నారు..? ఫ్యాషన్‌ వస్త్రాలు, మొబైల్స్‌... ఇవే కాదు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్‌ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. నీల్సన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కామర్స్‌ సంస్థలు దేశీయ ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తమ వాటాను మూడు రెట్లు పెంచుకోవడం ఆన్‌లైన్‌ షాపింగ్‌ డిమాండ్‌ను తెలియజేస్తోంది.

Most from this category