STOCKS

News


ఈ-కామర్స్‌లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా

Friday 12th July 2019
news_main1562913321.png-27001

  • బ్యాంకింగ్, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా ఈ-కామర్స్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. తమ ఖాతాదారులకు వివిధ రకాల బ్యాంకింగ్‌ సేవలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేకంగా 'డిజిటల్ కామర్స్ పోర్టల్‌' ఏర్పాటు చేస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంలోను, నిర్వహించడంలోనూ తోడ్పాటు అందించే సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. బిడ్ల దాఖలుకు జూలై 26 ఆఖరు తేది. అనలిటిక్స్‌ ఉపయోగించి కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం, వివిధ ఉత్పత్తులను విక్రయించేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటల్ సెక్యూరిటీ నిర్వహణ, పబ్లిసిటీ నిర్వహణ తదితర బాధ్యతలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం పార్ట్‌నర్‌కు ఉంటాయి. ఇక వ్యవసాయ విభాగంలో పంట రుణాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు మొదలైన ఉత్పత్తులను అందించాలని బ్యాంక్ భావిస్తోంది. వీటితో పాటు బంగారంపై రుణాలు, బీమా పథకాలు, పెట్టుబడి సాధనాలు వంటివి కూడా అందించనుంది. బిడ్ దక్కించుకునే సంస్థ ఇందుకు అవసరమైన విధంగా పోర్టల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే, ఈ పోర్టల్‌ ద్వారా విక్రయాలు జరిపే వ్యాపార సంస్థలకు కూడా కేటలాగ్‌ నిర్వహణ, ధరలు, ప్రచారం వంటి విషయాల్లో కూడా తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. 



You may be interested

బేరిష్‌గా మారుతున్న ఎఫ్‌పీఐలు

Friday 12th July 2019

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బడ్జెట్‌ అనంతరం దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేరిష్‌గా మారుతున్నారు. బడ్జెట్‌ అనంతరం నాలుగు సెషన్లలో వీరు దాదాపు రూ.2వేల కోట్ల షేర్లు విక్రయించారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐలు బేరిష్‌బెట్స్‌ పెంచుకుంటున్నారు. అధికాదాయ వర్గాలపై పన్ను పెంపు, సర్‌చార్జీ విధింపులు ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐ లాంగ్‌ షార్ట్‌ నిష్పత్తి 47కు చేరువైంది. ఫిబ్రవరి తర్వాత ఈ నిష్పత్తి

స్థిరంగా పసిడి

Friday 12th July 2019

క్రితం ట్రేడింగ్‌లో 1శాతం వరకు క్షీణించిన పసిడి ధర శుక్రవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,408.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత,  మరోసారి తెరపైకి వచ్చిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంకా తగ్గముఖం పట్టని అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు పసిడి ధరకు మద్దతునిస్తు‍న్నాయి. కీలక వడ్డీరేట్లపై కోత ఉండవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

Most from this category