971 కోట్లు సమీకరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
By Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా బాసిల్-3 బాండ్ల జారీ ద్వారా రూ.971 కోట్లు సమీకరించింది. ఒక్కోటి రూ.10 లక్షల ముఖ విలువ గల బాసెల్-3 టైర్ టూ బాండ్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఈ అన్సెక్యూర్డ్, రిడీమబుల్ బాండ్ల కూపన్ రేటు 8.42 శాతం. ఈ బాండ్ల జారీ గురువారమే ఆరంభమై, అదే రోజు ముగిసిందని, 17 సంస్థలకు ఈ బాండ్లు కేటాయించామని వివరించింది. బాండ్ల జారీ ద్వారా రూ.971 కోట్ల పెట్టుబడుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 1.1 శాతం లాభంతో రూ.106 వద్ద ముగిసింది.
You may be interested
సాఫ్ట్బ్యాంకులోకి కీర్తిగా రెడ్డి
Saturday 8th December 2018న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంకు 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను ఫేస్బుక్ నుంచి తీసుకుంటున్న కీర్తిగారెడ్డికి అప్పగిస్తోంది. విశేషమేమిటంటే సాఫ్ట్‌బ్యాంకు ఓ మహిళను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు పరిధిలో 12 ఫండ్స్ ఉన్నాయి. ‘‘సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌లో కీర్తిగారెడ్డి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫండ్‌ను ఆమె నిర్వహిస్తారు. సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్ నిషార్‌తో
ఎయిరిండియా ముంబై భవంతిపై ఎల్ఐసీ ఆసక్తి
Saturday 8th December 2018ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాకు దక్షిణ ముంబైలో ఉన్న 23 అంతస్తుల భవంతిపై పలు ప్రభుత్వ రంగ సంస్థలు కన్నేశాయి. ఈ ప్రాపర్టీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతకన్నా ముందే ఎల్ఐసీ, జీఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజాలు దీనిపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌లైన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ముంబైలోని కీలక వ్యాపార కేంద్రం నారిమన్ పాయింట్లో