STOCKS

News


‍బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం నాలుగు రెట్లు

Wednesday 30th January 2019
news_main1548821194.png-23885

- క్యూ3లో రూ. 471 కోట్లు
- స్వల్పంగా తగ్గిన ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 11.31 శాతం నుంచి 11.01 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.97 శాతం నుంచి 4.26 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే.. డిసెంబర్ 31 నాటికి స్థూల మొండిబాకీలు రూ. 53,184 కోట్లుగా ఉన్నాయి. మొండిబాకీలకు కేటాయింపులు రూ. 3,155 కోట్ల నుంచి రూ. 3,416 కోట్లకు పెరిగాయి.



You may be interested

బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలి

Wednesday 30th January 2019

కట్‌, సానబెట్టిన వజ్రాలు, రత్నాలపైనా తగ్గించాలి నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు ఇంకా వేధిస్తున్నాయ్‌ కేంద్ర ఆర్థిక శాఖను కోరిన రత్నాభరణాల పరిశ్రమ టీవీ, ఏసీ, ప్రిడ్జ్‌లపై దిగుమతి సుంకాలు పెంచాలి దేశీయ తయారీని పెంచేందుకు ఇది అవసరం కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారుల సంఘం వినతి ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని

బ్యాంకింగ్‌ షేర్ల జోరు..గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 30th January 2019

సెన్సెక్స్‌ 230 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో ప్రారంభం క్రితం రోజు కొన్ని కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్లకు పోత్రాహాన్నివ్వడంతో బుధవారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్ల లాభంతో 35,850 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,710 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాలకే కొంతవరకూ లాభాల్ని సూచీలు కొల్పోయినా, స్థిరంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన యాక్సిస్‌

Most from this category