STOCKS

News


తగ్గిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు

Friday 24th May 2019
news_main1558682769.png-25908

  • రెండేళ్ల కనిష్టానికి నికర మొండి బకాయిలు 
  • రూ.15,285 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నికర నష్టాలు(స్టాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.991 కోట్లకు తగ్గాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది.  అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం, బ్యాంక్‌ నిరాశపరిచింది. గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో ఈ బ్యాంక్‌కు రూ.471 కోట్ల నికర లాభం వచ్చింది. ఇక మొత్తం ఆదాయం రూ.12,735 కోట్ల నుంచి రూ.15,285 కోట్లకు పెరిగింది. 

11 శాతం పెరిగిన ఏడాది ఆదాయం....
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.2,432 కోట్ల నికర నష్టాలు(స్టాండ్‌ ఆలోన్‌)రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.433 కోట్ల నికర లాభం వచ్చింది. కన్సాలిడేటెడ్‌ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,887 కోట్ల నికర నష్టాలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం(స్టాండ్‌అలోన్‌) 11 శాతం వృద్ధితో రూ.56,065 కోట్లకు, కన్సాలిడేటెడె పరంగా అయితే 13 శాతం వృద్ధితో రూ.60.793 కోట్లకు పెరిగింది. 

మెరుగుపడిన రుణ నాణ్యత...
బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 12.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 9.61 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.49 శాతం నుంచి 3.33 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.15,609 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.3,521 కోట్లకు చేరాయి. ఇది ఎనిమిది క్వార్టర్ల కనిష్ట స్థాయి. కేటాయింపులు రూ.7,053 కోట్ల నుంచి రూ.5,550 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యాపారం రూ.10,18,747 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.11,07,509 కోట్లకు పెరిగింది.  



You may be interested

వాణిజ్య పోరుతో భారత్‌కు లాభం

Friday 24th May 2019

అమెరికా, చైనాకు ఎగుమతులు పెంచుకునే అవకాశం విశ్లేషకులు, పరిశ్రమవర్గాల అంచనా న్యూఢిల్లీ: అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని భారత్‌ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రెండు దేశాలకు దుస్తులు, వ్యవసాయోత్పత్తులు, వాహనాలు, యంత్రాలు మొదలైన వాటిని ఎగుమతి చేసే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధంలో చైనా నుంచి దిగుమతయ్యే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను

ఎన్‌డీఏ 2.0 కోసం స్టాక్‌ రికమండేషన్లు

Friday 24th May 2019

ఎన్‌డీఏ కూటమి రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని దేశీయ మార్కెట్లు, బ్రోకరేజ్‌లు స్వాగతించాయి. గతంలో చేపట్టిన సంస్కరణలు ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే బీజేపీ సొంతంగా ఈ దఫా మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఎన్‌డీఏ తొలి దశ ఐదేళ్లలో సూచీలు ఏడాదికి సుమారు 11 శాతం చొప్పున రాబడులు ఇచ్చాయి. ఈ సారి మరింత ఎక్కువ రాబడులుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

Most from this category