STOCKS

News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భేష్‌

Wednesday 31st October 2018
news_main1540972761.png-21610

-20 శాతం వృద్ధి
-మెరుగుపడిన రుణ నాణ్యత
-8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు మొత్తం ఆదాయం

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.425 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.355 కోట్ల నికర లాభం వచ్చిందని 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 40 శాతం పెరిగి రూ.686 కోట్లకు ఎగసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.12,490 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం  ఈ క్యూ2లో 8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు పెరిగిందని వివరించింది.
నికర వడ్డీ ఆదాయం 21 శాతం అప్‌
నికర వడ్డీ ఆదాయం రూ.3,720 కోట్ల నుంచి 21 శాతం పెరిగి రూ.4,492 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఈ క్యూ2లో తాజా మొండి బకాయిలు రూ.2,281 కోట్లుగా ఉన్నాయని, గత ఏడాదిన్నర కాలంలో ఇవే అతి తక్కవ తాజా మొండి బకాయిలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. గత క్యూ2లో 5.40 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 4.86 శాతానికి తగ్గాయని వెల్లడించింది. ఈ క్యూ1లో 12.46 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ2లో 11.8 శాతానికి తగ్గాయని తెలిపింది. మొండి బకాయిల కోసం రూ.1,467 కోట్ల కేటాయింపులు జరిపామని, ఇది తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయని వివరించింది. మొత్తం కేటాయింపులు  4 శాతం పెరిగి రూ.2,430 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో 1.82 శాతంగా ఉన్న రుణ వ్యయం ఈ క్యూ2లో 1.31 శాతానికి తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్‌ 2.34 శాతం నుంచి 2.61 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, ఇది స్వల్పంగా తగ్గింది.



You may be interested

టెక్‌ మహీంద్రా లాభం రూ.1064 కోట్లు

Wednesday 31st October 2018

27 శాతం వృద్ధి కలసివచ్చిన రూపాయి పతనం 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: టెక్‌ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,064 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.836 కోట్లు నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 19 శాతం పెరిగింది. రూపాయి పతనం

యాపిల్‌ ఐపాడ్‌ప్రో వచ్చింది.

Wednesday 31st October 2018

- ఐఫోన్ 10ఎస్ ఫీచర్లు - 12.9 అంగుళాల స్క్రీన్‌ - ధర 999 డాలర్లు న్యూయార్క్‌: గ్యాడ్జెట్‌ ప్రియుల కోసం యాపిల్‌ ‘ఐప్యాడ్ ప్రో’ను  మంగళవారం ఆవిష్కరించింది. తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 10ఎస్ ఫీచర్లతో ఈ ఐప్యాడ్‌ రూపొందింది. రెండు వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్స్‌ లభిస్తున్నాయి. 11 అంగుళాల స్క్రీన్‌ కలిగిన ఐప్యాడ్‌ ధర 799 అమెరికా డాలర్లు. కాగా, 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ధర 999 అమెరికా డాలర్లుగా

Most from this category