STOCKS

News


డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ !

Thursday 14th February 2019
news_main1550125006.png-24190

  • ఆరంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా !!

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణాలపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను ప్రారంభించిందని సమాచారం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించారంటూ వెబ్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.  ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో బీఓబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలన్న నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఆడిట్‌ను కేపీఎమ్‌జీ నిర్వహించనున్నదని ఆ వర్గాలు తెలిపాయి. డీహెచ్‌ఎఫ్ఎల్‌ రుణాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలన్న ఆదేశాలు ఎస్‌బీఐకి కూడా చేరాయని సమాచారం. గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బ్యాంక్‌ రుణాలు రూ.38,000 కోట్లుగా ఉన్నాయి. కాగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పేర్కొంది. విడిగా కంపెనీల విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కేపీఎమ్‌జీ తెలిపింది. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు సదరు సంస్థ వ్యాపారాల కోసమే వినియోగించారా లేదా స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించారా అనే విషయం ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తెలిసే అవకాశాలుంటాయి.



You may be interested

ఐఎల్‌ఎఫ్ఎస్ సంక్షోభంపై ఎంక్వైరీ కమిషన్‌ వేయాలి

Thursday 14th February 2019

- పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. "ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర

చైనా స్మార్ట్‌ఫోన్స్ హవా

Thursday 14th February 2019

దేశీయంగా అమ్ముడయ్యే ప్రతి 10 ఫోన్స్‌లో 6 చైనావే కష్టాల్లో దేశీ మొబైల్‌ తయారీ సంస్థలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన మార్కెట్‌ వాటా న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో చైనా కంపెనీల ధాటికి ఎదురు నిలవలేక దేశీ సంస్థలు కుదేలవుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం దాకా ఆధిపత్యం కొనసాగించిన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్‌ వంటి దేశీ బ్రాండ్స్‌ అమ్మకాలు ప్రస్తుతం గణనీయంగా క్షీణించాయి. 2015లో స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో దేశీ సంస్థల వాటా  43

Most from this category